బీహార్ ఎన్నికల సమరానికి ఎన్నికల సంఘం సిద్దమైంది. ఈ రోజు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. రెండు లేదా మూడు విడతల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2025 నవంబర్‌ 22తో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగుస్తుంది. ఈ లోగానే కొత్త అసెంబ్లీ ఏర్పాటు దిశగా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది. గతంలో బీహార్‌లో మూడు, ఐదు విడతల్లో పోలింగ్‌ నిర్వహించారు. ఈ సారి ఒకే విడత పోలింగ్‌ జరపాలని జేడీయూ కోరగా.. రెండు, మూడు దశల్లో నిర్వహించాలని మిగతా పార్టీలు కోరాయి. బీహార్‌ ఎన్నికల పరిశీలకులుగా 470 మంది అబ్జర్వర్లను ఎన్నికల సంఘ నియమించింది. అక్టోబర్‌ 28న ఛత్‌ పండగ ఉండటంతో.. అక్టోబర్‌ 31 తర్వాత తొలి దశ నిర్వహించే అవకాశం ఉండే అవకాశం ఉంది. ఇక, ఇప్పటికే పలు సర్వే సంస్థలు బీహార్ లో ఓటర్ల నాడి పట్టుకునే ప్రయత్నం చేసాయి. పలు సర్వే సంస్థలు ఇక్కడ పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుందని అంచనా వేసాయి. ప్రధాని మోదీ బీహార్ లో పలుమార్లు పర్యటించారు. బీహార్ కోసం గత బడ్జెట్ నుంచి ఇప్పటి వరకు కేంద్రం పలు వరాలు ప్రకటించింది. కాగా, అభ్యర్ధుల ఖరారు.. మేనిఫెస్టోల తరువాత బీహార్ ఎన్నికల సమరం మరింత వేడెక్కే అవకాశం ఉంది.

కాగా, ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఈ రోజు షెడ్యూల్ విడుదల కానుంది. బీహార్ ఎన్నికలతో పాటుగానే ఈ ఉప ఎన్నిక జరగనుంది. ఇప్పటికే బీఆర్ఎస్ తమ అభ్యర్ధిని ఖరారు చేసింది. కాంగ్రెస్ బీసీ అభ్యర్ధిని బరిలోకి దింపనుంది. బీజేపీ తమ అభ్యర్ధి ఖరారు పైన కసరత్తు చేస్తోంది. జూబ్లీహిల్స్ లో గెలుపు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకం కావటంతో.. ఈ రోజు షెడ్యూల్ తరువాత రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos