ఏపీలో మే 13న జరిగిన ఎన్నికలు .. పార్టీల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. కేవలం పోలింగ్ కాకుండా.. ఆ రోజు జరిగిన హింసాత్మక ఘటనలు కూడా.. రాష్ట్రంలో అశాంతిని రేపాయి. పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగడంతో.. కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయింది. అయితే.. జూన్ 4న  ఓట్ల లెక్కింపు రోజు కూడా పెద్ద ఎత్తున హింసాయుత ఘటనలు జరగవచ్చని..  ఇంటెలిజెన్స్ అధికారులు కూడా నివేదికలు అందించారు. ఎన్నికల కౌంటింగ్ కు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా.. ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతతో పాటు.. ఫలితాలను  త్వరితగతిన ప్రకటించేలా  ఏర్పాటు ఉండాలని ఆదేశించారు. కౌంటింగ్ సమయానికి కొద్ది రోజులే మిగిలి ఉండటంతో..  జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఎక్కడా పొరపాట్లు జరగకుండా.. ఈవీఎం ఓట్ల లెక్కింపులో ఎలాంటి వివాదాలకూ తావు లేకుండా చూడాల్సిందన్నారు. కౌంటింగ్ సంబంధిత వివరాలను అభ్యర్దులకు, ఏజెంట్లకు ముందుగా తెలియచేయాలని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రంలో టేబుల్స్ , ఎన్ని రౌండ్ల లెక్కింపు అనే విషయాలను .. ముందే తెలియజేయాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా మీడియా సెంటర్లను ఏర్పాటు చేయాలని.. స్ట్రాంగ్ రూముల నుంచి ఈవీఎంల తరలింపు మార్గాలు, అభ్యర్ధులు , ఏజెంట్లు వెళ్లేందుకు వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. అసెంబ్లీ, పార్లమెంటులకు వేర్వేరుగా పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి..  ఓట్ల లెక్కింపు టేబుళ్లను ఏర్పాటు చేయాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేకంగా టేబుళ్లు ఏర్పాటు చేయాలని .. ఎంకే మీనా స్పష్టం చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించాకే ఈవీఎంల లెక్కింపు మొదలు కావాలని.. ఈసీ నిర్వహించే ఎన్ కోర్ వెబ్ అప్లికేషన్ లో ఫలితాలను వెంటనే అప్ లోడ్ చేయాలని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్దకు..  అనధికార వ్యక్తులు, గుర్తింపు కార్డులు లేని వ్యక్తులను అనుమతించవద్దని .. ఎవరైనా ఆదేశాలను ధిక్కరిస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మొదట లెక్కింపు నుంచి పూర్తయ్యే వరకూ స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రత కొనసాగుతుందని.. ప్రతి ఒక్కరూ అప్రమత్తతతో బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos