దేశంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కేంద్రంలోని అధికార బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని అప్పుడే మొదలు పెట్టేసింది. ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటికే పర్యటనలతో బిజీగా ఉన్నారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ రోజుకో కార్యక్రమంతో ప్రజల్లోనే ఉంటోంది. కాంగ్రెస్ కూడా అదే పనిలో ఉన్నప్పటికీ ఇంకా జోరందుకోలేదు. ఈ ఏడాది రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరంలో శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను ఈ నెల 8-10 మధ్య ఎన్నికల కమిషన్ ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి. నవంబరు రెండో వారం నుంచి డిసెంబరు మొదటి వారం వరకూ ఎన్నికలు జరగొచ్చని పేర్కొంది.
2018 ఎన్నికల్లానే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం, తెలంగాణలో ఒక విడతలోనే ఎన్నికలు పూర్తి చేయాలని ఈసీ నిర్ణయించినట్లు సమాచారం. అలాగే, గతంలో నిర్వహించినట్లుగానే ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే, ఎన్నికల తేదీలు మాత్రం వేర్వేరుగా ఉండనున్నాయి. ఓట్ల లెక్కింపు డిసెంబరు 10-15 మధ్య ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ అధికారంలో ఉండగా, మధ్యప్రదేశ్‌లో బీజేపీ, చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. మిజోరాం శాసనసభ పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్ 17తో ముగుస్తుంది. ఈశాన్య రాష్ట్రంలో బీజేపీ మిత్రపక్షమైన మిజో నేషనల్ ఫ్రంట్ - ఎంఎన్‌ఎఫ్ అధికారంలో ఉంది. తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ శాసనసభల పదవీకాలం వచ్చే ఏడాది జనవరిలో వేర్వేరు తేదీల్లో ముగుస్తుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడానికి ముందు, రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో ఈసీ ... ఎన్నికల సంసిద్ధతను పరిశీలించింది. కాగా... ఈ తేదీలకు సీఈసీ చీఫ్ రాజీవ్ కుమార్ ఇంకా అప్రూవల్ చేయాల్సి ఉంది. ఆ తరవాతే అధికారికంగా ప్రకటిస్తారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos