తెలంగాణలో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని.. ఎన్నికలకు మరో రెండు మూడు నెలలు మాత్రమే గడువు ఉందని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు. జిల్లాల్లో అధికారులకు ఈవీఎమ్‌లపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో కొత్త ఓటర్లలో 18, 19 ఏళ్ల వయసు ఉన్న యువ ఓటర్లు 6.99 లక్షల మందిని ఓటర్ల జాబితాలో చేర్చామన్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్ల నమోదుపై ఫోకస్ చేశామన్నారు. థర్డ్ జెండర్ లను, 80 ఏళ్లు పైబడిన వృద్ధులను గుర్తిస్తున్నామని చెప్పారు. ఈసీ ఆదేశాల మేరకు పీడబ్ల్యూడీలను లక్ష మందికి పైగా ఇటీవల గుర్తించినట్లు తెలిపారు. జనవరి నుంచి ఇప్పటివరకూ కొత్తగా 15 లక్షల మందిని ఓటర్ల జాబితాలో చేర్చామని చెప్పారు. అదే సమయంలో రాష్ట్రంలో 3.38 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లు చెప్పారు. ఇంటి నుంచి ఓటింగ్ వేసే వారిని గుర్తించి అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈసీ అధికారులు, పరిశీలకులు త్వరలో జిల్లాల్లో పర్యటిస్తారు. రాజకీయ పార్టీలతో, కలెక్టర్లు, ఎస్పీలతో, సీఎస్ తో ఎన్నికల అధికారులు సమావేశాలు నిర్వహించనున్నారని చెప్పారు. ఎన్నికల నిర్వహణ చాలా పారదర్శకంగా జరుగుతోందని.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పీస్ నిర్వహణ జరగనుందని తెలిపారు. వచ్చే నెల 3,4,5 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర పర్యటన జరుగుతుందని అన్నారు. కేంద్ర - రాష్ట్ర పరిధిలో 20 ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు పనిచేయబోతున్నాయని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నామన్నారు. చాలా సమస్యలపై చాలా ఫిర్యాదులు వచ్చాయన్నారు. నాలుగు వేల భవనాలు ఇప్పటికే గుర్తించి ఎన్నికల నిర్వహణ జరుగుతోందన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో అడ్రస్ మార్పుల ఫిర్యాదులు వచ్చాయని.. వాటిపై చర్యలు ఉంటాయని సీఈవో వికాస్ రాజ్ వెల్లడించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos