ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదన్నదానిపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. పోలింగ్ ముగియడంతో పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తున్నాయి. పోరాటం హోరాహోరీగా సాగినా భారతీయ జనతా పార్టీకే ఎడ్జ్ ఉందని ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
పీపుల్స్ పల్స్- కొడిమో సంస్థలు సంయుక్తంగా ఢిల్లీలో నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలో ఓటర్లు బీజేపీ వైపు నిలిచారని వెల్లడైంది. 27 సంవత్సరాల తరువాత ఢిల్లీ ఓటర్లు బీజేపీకి పట్టం కట్టబోతున్నారని ఆ సర్వే సంస్థ వెల్లడించింది. డబుల్ ఇంజన్ సర్కార్‌ను ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నారని పీపుల్స్ పల్స్ - కొడిమో తెలిపింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 51 - 60, ఆమ్ ఆద్మీ పార్టీ 10-19, కాంగ్రెస్, ఇతరులు ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదని తన సర్వేలో వెల్లడించింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48.5- 52.5 ఓట్లు పొందుతుందని.. ఆమ్ ఆద్మీ పార్టీకి 36.5 నుంచి 40.5 శాతం ఓట్లు పడతాయని ఆ సర్వే సంస్థ పేర్కొంది. కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఘోర ఫలితాలు ఉంటాయని.. ఆ పార్టీకి ఓటింగ్ శాతం 6.5 నుంచి 8.5 వరకు మాత్రమే ఉంటుందని వెల్లడించింది. ఇతరులు 3.1 నుంచి 5.1 ఓట్లు పొందే అవకాశం ఉన్నట్లు పీపుల్స్ పల్స్ - కొడిమో సంస్థలు తమ ఎగ్జిట్ పోల్‌లో వెల్లడించాయి.
ఈ సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను సమగ్రంగా విశ్లేషిస్తే ఆసక్తికర అంశాలు ఉన్నాయి. మహిళా ఓటర్లు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ వైపే ఉన్నట్లు తెలుస్తోంది. మహిళా ఓటర్లలో బీజేపీపై ఆప్ 8.3 శాతం ఆధిక్యత కనబరుస్తోందని ఆ సంస్థలు తెలిపాయి. మహిళలు ఆప్‌కు 50.20 శాతం, బీజేపీకి 41.90 శాతం, కాంగ్రెస్‌కు 6.10 శాతం, ఇతరులకు 1.90 శాతం మద్దతిస్తున్నారని పీపుల్స్ పల్స్- కొడిమో సంస్థలు తెలిపాయి. కమలం పార్టీకి బ్రాహ్మణులు, రాజ్‌పుత్, యాదవ్, జాట్, బనియా, కశ్మీరీ పండిట్లు, గుప్త సామాజికవర్గాలు మద్దతిచ్చారని.. అగ్రవర్ణాలు, వెనుకబడిన ఓబీసీలు, దళితులు ఆప్ వైపు నిలిచారని వెల్లడించింది.
హిందువులు, జైన్లు, ఇతరులు బీజేపీకి, ముస్లింలు, సిక్కులు ఆప్‌కు మద్దతిచ్చారని పీపుల్స్ పల్స్- కొడిమో సంస్థలు తెలిపాయి. బీజేపీకి పూర్వాంచల్, ఢిల్లీ, ఉత్తరాది, పాహడి ప్రాంతాలకు చెందిన ప్రజలు మద్దతిస్తుండగా.. ఆమ్‌ఆద్మీ పార్టీకి పంజాబీలు, దక్షిణాది ప్రజలు మద్దతిస్తున్నారని వెల్లడించింది. ఆమ్‌ఆద్మీ పార్టీకి దళితులు, ముస్లింలు, సిక్కులు, జాదవ్, చమార్, వాల్మీకి సామాజికవర్గాల్లో అధిక మద్దతు లభిస్తోంది. మోస్ట్ పాపులర్ నాయకుడిగా అరవింద్ కేజ్రీవాల్ నిలిచినట్లు ఆ సంస్థలు వెల్లడించాయి. డబుల్ ఇంజన్ సర్కార్ వల్లనే ఢిల్లీ అభివృద్ధి చెందుతుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని ఆ సంస్థలు పేర్కొన్నాయి.
ఇంకా పలు సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
మాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ :
ఆమ్ ఆద్మీ పార్టీ - 32 -37
బీజేపీకి -35-40
కాంగ్రెస్ -0-1
చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్ :
ఆమ్ ఆద్మీ పార్టీ - 25 -28
బీజేపీకి -39-44
కాంగ్రెస్ -02-03
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ :
ఆమ్ ఆద్మీ పార్టీ - 10-19
బీజేపీకి -51-60
కాంగ్రెస్ 00-00
పీ మార్గ్ ఎగ్జిట్ పోల్స్ :
ఆమ్ ఆద్మీ పార్టీ - 21 -31
బీజేపీకి -39-49
కాంగ్రెస్ -00-01
పోల్ డైరీ ఎగ్జిట్ పోల్స్ :
ఆమ్ ఆద్మీ పార్టీ - 18 -25
బీజేపీకి -42 - 50
కాంగ్రెస్ -00-02
పోల్స్ ఇన్ సైట్ ఎగ్జిట్ పోల్స్ :
ఆమ్ ఆద్మీ పార్టీ - 25 -29
బీజేపీకి -40 - 44
కాంగ్రెస్ -00-01
వీ ప్రిసైడ్ ఎగ్జిట్ పోల్స్ :
ఆమ్ ఆద్మీ పార్టీ - 46-52
బీజేపీకి - 18-23
కాంగ్రెస్ -00-01
టైమ్స్ నౌ జేవీసీ ఎగ్జిట్ పోల్స్ :
ఆమ్ ఆద్మీ పార్టీ - 22 - 31
బీజేపీకి -39-45
కాంగ్రెస్ -00-02
మైండ్ బ్రింక్ ఎగ్జిట్ పోల్స్ :
ఆమ్ ఆద్మీ పార్టీ - 44-49
బీజేపీకి -21-25
కాంగ్రెస్ -00-01
హైదరాబాద్ సంస్థ ఆబ్సల్యూట్ పొలిటికో కూడా బీజేపీదే విజయం అని తేల్చింది. ఈ ఎన్నికల్లో కాషాయం విజయం ఏకపక్షమేనని ప్రకటించింది. ఈ సంస్థ చేసిన సర్వే ప్రకారం బీజేపీకి 43 నుంచి 52 సీట్లు వస్తాయని పేర్కొంది. ఆమ్ఆద్మీ పార్టీకి 15-27 సీట్లే లభిస్తాయని అంచనాలు వేస్తోంది. కాంగ్రెస్ కు అతికష్టమ్మీద రెండు సీట్ల వరకు వచ్చే అవకాాశం ఉందని తేల్చింది.
ఎగ్జిట్ పోల్స్ లో చాలా వరకూ బీజేపీకే అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. రెండు ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. కౌంటింగ్ జరగనున్న ఎనిమిదో తేదీ ఎవరి భవితవ్యం ఏమిటో తేలుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos