రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ను విజయవాడలోని ఏసీబీ కోర్టు పొడిగించింది. ఈ రోజుతో చంద్రబాబు రిమాండ్ గడువు ముగిసిన నేపథ్యంలో జైలు నుంచి చంద్రబాబును వర్చువల్ గా కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఈ నెల 9న చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారించిన ఏసీబీ కోర్టు.. చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది. నేటితో కస్టడీ ముగియగా.. కోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలు నుండే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో జడ్జి మాట్లాడుతూ... మరో రెండురోజుల పాటు అంటే ఈ నెల 24 వరకు మీరు రిమాండ్ లోనే ఉంటారని ... విచారణకు గాను మిమ్మల్ని కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరుతోందని తెలిపారు. మీకు విధించిన రిమాండ్ ను శిక్షగా భావించొద్దని చెప్పారు. జైల్లో మీకు ఇబ్బందేమైనా కలుగుతోందా? అని ప్రశ్నించారు. మీపై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయని, నేరం నిరూపణ కాలేదని, దర్యాప్తులో అన్నీ తేలుతాయని చెప్పారు. చట్టం అందరికీ సమానమేనని అన్నారు. ఇంకోవైపు, జైల్లో చంద్రబాబుకు కల్పిస్తున్న వసతులపై పూర్తి వివరాలను ఇవ్వాలని జైలు అధికారులను జడ్జి ఆదేశించారు.  తన గురించి దేశంలో, రాష్ట్రంలో అందరికీ తెలుసని ... రాజకీయ కక్షలో భాగంగానే తనను అరెస్ట్ చేశారని చంద్రబాబు తెలిపారు. తన వివరణ తీసుకోకుండానే అరెస్ట్ చేశారని, తన అరెస్ట్ అక్రమమని ... 40 ఏళ్ల రాజకీయ జీవితం కలిగిన తనకు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. తన తప్పు ఉంటే విచారించి, అరెస్ట్ చేయాల్సిందని అన్నారు. తన హక్కులను కాపాడాలని, న్యాయాన్ని రక్షించాలని జడ్జిని కోరారు. రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశానని ... తనను జైల్లో ఉంచి మానసిక క్షోభకు గురి చేస్తున్నారని చెప్పారు. ఈ వయసులో తనకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ కస్టడీపై మీ అభిప్రాయం చెప్పాలని చంద్రబాబును న్యాయమూర్తి అడగ్గా... న్యాయం గెలవాలని, చట్టం ముందు అందరూ సమానవేనని చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు చెప్పిన విషయాలను జడ్జి నోట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు తరపు లాయర్లు తమ వాదననలు వినిపిస్తూ... చంద్రబాబును కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. కాగా, చంద్రబాబు కస్టడీపై కాసేపట్లో తీర్పు వెలువడే అవకాశం ఉంది. కస్టడీ తీర్పు నేపథ్యంలో సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos