ఒరిస్సాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం వార్త విన్న తరువాత.... ఇక రైలెక్కి ప్రయాణం చేయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఒరిస్సా ప్రమాదపు భయాందోళనలు ఇంకా మరిచిపోనేలేదు. ఈలోగా ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం జరగడంతో సర్వత్రా తీవ్రంగా భీతిల్లుతున్నారు. ఫలక్ నుమా రైలులో అందరూ చూస్తుండగానే కళ్ల ముందు అకస్మాత్తుగా పొగ, మంటలు చెలరేగి బోగీలు కాలిపోయాయి. ఇంత పెద్దఎత్తున మంటలకు కారణమైన నిప్పు రవ్వను రగిలించిందెవరనే అనుమానాలు రానురాను జోరందుకుంటున్నాయి. సికింద్రాబాద్ కు రావాల్సిన ఈ రైలు.. స్టేషన్ కు 40 కి.మీ. దూరంలో ఉండగానే... ప్రమాదానికి గురికావటం.. ఆరు బోగీలు తగలబడిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

దీనిపై కొందరు కుట్ర కోణాన్ని వినిపిస్తుంటే.. మరికొందరు ప్రమాదవశాత్తు జరిగిన ఘటనే అని అంటున్నారు. ఇంకొందరు మాత్రం ... ప్రయాణికులు సిగరెట్లను కాల్చటం వల్లనే నిప్పు పుట్టటానికి కారణమై ఉంటుందని చెబుతున్నారు. పశ్చిమబెంగాల్ లోని హావ్ డా నుంచి సికింద్రాబాద్ కు బయలుదేరిన ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ శుక్రవారం ఉదయం 10.10 గంటలకు గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉంది. అయితే.. ఈ రైలు మూడుగంటలు ఆలస్యంగా నడుస్తున్న వేళలోనే ప్రమాదానికి గురి కావటం హాట్ టాపిక్ గా మారింది. షెడ్యూల్ ప్రకారం సికింద్రాబాద్ స్టేషన్ కు వచ్చి ఉంటే.. ప్రమాద ఘటన నుంచి తప్పించుకునే వీలుండేదని అంటున్నారు.

సుమారు వారం లేదా పది రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి ఒకరు దక్షిణ మధ్య రైల్వేకు ఒక హెచ్చరిక లేఖ పంపారు. వారం వ్యవధిలో రైలు ప్రమాదం జరుగుతుందని.. ఒరిస్సాలోని బవాలాసోర్ ప్రమాద ఘటన తరహాలో హైదరాబాద్ - ముంబయి మార్గంలో జరుగుతుందని ఆ లేఖలో పేర్కొన్నారని సమాచారం. అయితే... ఈ లేఖకు.. ప్రమాదానికి లింకు పెట్టొద్దని అధికారులు చెబుతున్నారు కానీ.. మంటలకు కారణమేమిటనే ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇంతకీ ... ఈ ప్రమాదానికి కారణమేమిటో రైల్వే అధికారులు కన్ఫర్మ్ చేసేవరకు అనేక అనుమానాలు వస్తూనే ఉంటాయి. ప్రమాదానికి కారణం ఎప్పుడు తెలుస్తుందో ఏమో మరి చూడాలి.

 

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos