గుజరాత్‌లోని అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మేఘానిలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. టేకాఫ్ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రాథమిక నివేదిక ప్రకారం విమానంలో 242 మందికి పైగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి 12 ఫైరింజన్లు చేరుకున్నాయి. ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఈ విమానం అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే ఎయిర్‌పోర్టు నుంచి 15 కిలోమీటర్ల దూరం వెళ్లాక ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు.
ప్రమాదం జరిగిన స్థలంలో పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అహ్మదాబాద్‌లో టేకాఫ్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విమానం వెనుక భాగం చెట్టును ఢీకొట్టిందని సమాచారం. కాగా, ఈ విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు.. ఎంతమందికి గాయాలయ్యాయనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos