ఢిల్లీలో మల్లయోధులు ఎంతోకాలం నుంచి కొనసాగిస్తున్న నిరసనలను ఎట్టకేలకు విరమించారు. రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజ్‌భూషణ్‌ను అరెస్ట్ చేయాలంటూ మైనర్ సహా టాప్ ఒలింపియన్స్ అయిన వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా తదితరులు సుమారు ఐదు నెలలుగా ఢిల్లీలో ఆందోళనకు చేస్తున్న సంగతి .... మైనర్ సహా ఏడుగురు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులతో రెజ్లింగ్ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలని వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియాతో సహా టాప్ ఒలింపియన్లు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

మహిళా రెజ్లర్ల నిరసన దేశవ్యాప్తంగా ఓ సంచలనం రేపాయి. మైనర్ రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్ వెనక్కి తీసుకోవాలని ఓవైపు పోలీసులు ఒత్తిడి తెచ్చినట్లు వార్తలు వచ్చాయి. దేశవ్యాప్తంగా నిరసన ఉద్యమాన్ని రేకెత్తించిన ఈ రెజ్లర్లు... ఐదు నెలల సుదీర్ఘ పోరాటం తర్వాత ఇకపై కోర్టులోనే మా పోరాటం కొనసాగిస్తామని ప్రకటిస్తూ....వారి ఆందోళనలను విరమించారు. ఈ మేరకు రెజ్లర్ సాక్షిమాలిక్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇకపై.. కోర్టులో యుద్ధం కొనసాగుతుందని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ కూడా అయిన భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌ పై ఈ నెల 15న ఛార్జ్‌షీట్ దాఖలు చేయడంతో ఆందోళన విరమించాలని నిర్ణయించినట్లు తెలిపారు.  

జులై11న జరిగే రెజ్లింగ్ అసోసియేషన్ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నామని సాక్షి మాలిక్ ట్వీట్ చేశారు. మరోవైపు లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ డబ్ల్యూఎఫ్‌ఐ అడ్మినిస్ట్రేషన్ బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. ఆయనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి... నేరం రుజువైతే బ్రిజ్ భూషణ్ సింగ్‌కు మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి మున్ముందు ఇంకా... ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos