అహ్మదాబాద్ లో దిగ్బ్రాంతికర ఘటన చోటు చేసుకుంది.  ఎయిరిండియాకు చెందిన విమానం విమానం కుప్పకూలింది. ప్రమాదానికి గురైన సమయంలో ఆ విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎయిర్ పోర్ట్ సమీపంలో ఉన్న మెఘానీ నగర్, షాహిబాగ్ వద్ద కుప్పకూలింది. సమాచారం అందిన వెంటనే రాష్ట్ర విపత్తు నిర్వహణ - అగ్నిమాపక సిబ్బంది, జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు, పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని... సహాయక చర్యలు చేపట్టారు. విమాన శకలాలు జనావాసాల మీద పడటం వల్ల మరణాల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిరిండియా విమానం అది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కుప్పకూలింది. పెద్ద శబ్దం చేస్తూ.. నిప్పు కణికలా నేలకు రాలింది. ఆ వెంటనే దట్టమైన పొగ వెలువడింది. సంఘటన స్థలంలో మంటలు చెలరేగాయి. సంఘటన స్థలంలో భయానక వాతావరణం నెలకొంది. అగ్నిమాపక వాహనాలు, అంబులెన్సులు, పోలీసు వాహనాల సైరన్ మోతలతో ఆ ప్రాంతం అంతా మార్మోగిపోయింది. సహాయక చర్యలు అందజేయడానికి సంఘటన స్థలానికి స్థానికులు పరుగులు తీశారు. అందుబాటులో ఉన్న వాహనాలను క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడాన్ని వినియోగించారు.

ఈ ఘోర దుర్ఘటన పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కు ఫోన్ కాల్ చేశారు. ఈ ఘటన చోటు చేసుకోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందజేయాలని ఆదేశించారు. ఇదే విమానంలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఆయనతో పాటు మరికొందరు రాజకీయ ప్రముఖులు, వీఐపీలు ఉన్నట్లు సమాచారం. వారి పరిస్థితి ఏమిటనేది ఇంకా తెలియరావట్లేదు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos