ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారథ్యంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మహిళలకు మాత్రమే పరిమితమైన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మరింత విస్తరించింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకూ దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఓ ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్స్ ను తగ్గించడానికి, విద్యార్థులకు మరింత మెరుగైన రవాణా వసతి కల్పించడానికి, ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఈ ఉచిత బస్సు సౌకర్యం.. ఎల్ కే జీ నుంచి ప్రీ యూనివర్శిటీ కోర్స్ (పీయూసీ) అంటే ఇంటర్మీడియట్ వరకు వర్తిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలు, ఇంటర్మీడియట్ వరకు విద్యను బోధించే అన్ని ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులు అందరికీ దీన్ని వర్తింపజేసింది. ప్రస్తుతం కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలులో ఉంటున్న విషయం తెలిసిందే. కేఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ప్రయాణించవచ్చు. దీనికోసం సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్ లో 1,000 కోట్ల రూపాయల మేర కేటాయింపులు చేస్తోంది. అదే సమయంలో- కొత్త బస్సులను కొనుగోలు చేస్తోంది. కొత్త కొత్త రూట్లల్లోనూ బస్సులను నడిపిస్తోంది.

ఇప్పుడు తాజాగా విద్యార్థులకు కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనికి అవసరమైన మొత్తాన్ని వార్షిక బడ్జెట్ లో కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉచిత బస్సు సౌకర్యం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 19 లక్షల మందికి విద్యార్థులకు లబ్ది కలుగుతుందని చెబుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos