వినాయక చవితి తెలుగువారందరికీ ఎంతో ముఖ్యమైన పండుగ. దేశంలో ఎక్కడ ఉన్నా తెలుగువారు ఈ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో ... ఉత్సహకర వాతావరణంలో జరుపుకుంటారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో భూత్‌నాథ్ ఆలయ ఆడిటోరియంలో ఆదివారం సుమారు 7 అడుగుల గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించి... పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అందమైన పండల్‌ను అలంకరించారు. ఉదయం గణేష్‌ పూజతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ పూజలు తెలుగు అసోసియేషన్ నుండి కేవీఎస్ఎన్ రావు దంపతులు నిర్వహించగా... లక్నోలో నివసిస్తున్న రెండు రాష్ట్రాలకు చెందిన తెలుగువారు వారి కుటుంబాలతో అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. కార్యక్రమంలో మహిళలు గణపతి కీర్తనలు ఆలపించి ప్రజలను మంత్రముగ్ధులను చేశారు. పూజల అనంతరం ప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలుగు సంఘం అధ్యక్షుడు డి.ఎన్.రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలుగు సంఘం తరపున ఏడాదికి 4 కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని... గణేష్ పూజ, ఉగాది, శ్రీరామనవమి వనభోజనాల కార్యక్రమాలు ఉత్సాహకర వాతావరణంలో జరుపుకుంటున్నామని తెలిపారు. అయితే కోవిడ్ సమయంలో కొంతకాలం వాయిదా వేశామని.. ఇప్పుడు పరిమితులు సడలించిన తర్వాత, గణేష్ ఉత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకుంటున్నామని అన్నారు. అంతేకాక ఈ సంవత్సరం లక్నోలోని రాజ్ భవన్ లో జరిగిన తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాలుపంచుకునే అవకాశం ఇచ్చిన గవర్నర్ కు ధన్యవాదములు తెలిపారు.
 

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos