తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ కు రాజీనామా లేఖ పంపారు. ఇన్నాళ్లూ బీఆర్ఎస్ కి తుమ్మల రాజీనామా చేస్తారన్న వార్తలు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు అధికారికంగా ఆయనే రాజీనామా లేఖ రాసి ముఖ్యమంత్రి కేసీఆర్ కు పంపారు. ఆ లేఖను కేవలం ఒకే వాక్యంతో ముగించినట్లు తెలుస్తోంది. "నాకు సహకరించినందుకు ధన్యవాదాలు. రాజీనామాని ఆమోదించండి" అని మాత్రమే రాసి పంపారని సమాచారం. బీఆర్ఎస్ నాయకత్వం ... ఇటీవల ప్రకటించిన అభ్యర్థుల మొదటి జాబితాలో తుమ్మలకు టికెట్ రాకపోవడం తెలిసిన విషయమే. దీంతో అప్పటినుంచి ఆయన అసంతృప్తిగా ఉన్నారు. అప్పటినుంచి పలురకాల వార్తలు ఆయన చుట్టూనే నడిచాయి. ఖమ్మం జిల్లాలో ఉప్పు- నిప్పులాగా ఉన్న పొంగులేటి ఇప్పటికే కాంగ్రెస్ లో ఉన్నందున... తుమ్మల ఆ పార్టీలో చేరతారా అనే అనుమానాలు కూడా చెలరేగాయి. అయితే పొంగులేటి ... అనూహ్యంగా తుమ్మలను పార్టీలోకి ఆహ్వానించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో తుమ్మల ఈ రోజు సాయంత్రం కాంగ్రెస్ లో చేరుతున్నారని పార్టీ వర్గాలు ఖరారు చేశాయి. వాస్తవానికి ... సెప్టెంబర్ 17న తుమ్మల కాంగ్రెస్‌లో చేరుతారని మొదట వార్తలు వినిపించాయి. కానీ ఆయన ఒకరోజు ముందుగా అంటే ఈ రోజు 16 వతేదీనే హస్తం తీర్ధం పుచ్చుకుంటున్నారు. ఈ పరిణామం ద్వారా అసెంబ్లీ ఎన్నికల ముంగిట అధికార బీఆర్‌ఎస్ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలినట్లేనని విశ్లేషకులు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos