కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.  డియర్‌నెస్‌ అలవెన్సు (DA) 2 శాతం మేర పెంచుతూ కేంద్ర కేబినెట్‌  28 మార్చి శుక్రవారం అంటే ఇవాళ నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పుడు ఇస్తున్న డీఏ 53 శాతం నుంచి 55 శాతానికి పెరగనుంది. ఈ మేరకు ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి. ఇలా పెంచిన డీఏ 2025 జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది. ఇది దాదాపు కోటి మందికిపైగా ఉద్యోగుల, రిటైర్డ్‌ ఉద్యోగులపై  ప్రభావం చూపనుంది. ఇప్పుడు పెంచిన డీఏ జనవరి నుంచి అమలులోకి వచ్చినప్పటికీ ఏప్రిల్ శాలరీతో రానుంది. అంటే మే నెలలో ఉద్యోగుల చేతికి అందనుంది. అప్పుడు 3 నెలల ఎరియర్స్‌తో కలిపి ఉద్యోగుల, పింఛన్‌దారులకు ఇవ్వనున్నారు. 

ప్రతి ఆరు నెలలకోసారి ప్రకటించే ఈ డీఏ ఈసారి మాత్రం ఆలస్యమైంది. జనవరి - జూన్ నెలలకు సంబంధించిన డీఏను ఏటా హోలీ టైంలో ప్రకటించేవారు. ఈసారి మాత్రం ఆలస్యమైంది. ఆ పెంపు కూడా అనుకున్న స్థాయిలో లేదని ఉద్యోగులు అంటున్నారు.  ఏడేళ్లలో ఇదే అత్యల్ప పెంపుగా చెబుతున్నారు. 2018 జులై నుంచి ప్రభుత్వం మూడు లేదా నాలుగు శాతం డీఏ పెంచుతూ వస్తోంది. ఈసారి మాత్రం రెండు శాతనికే పరిమితం చేయడంపై ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  8వ వేతన సంఘం ప్రకటించిన తర్వాత డీఏ పెంచడం ఇదే తొలిసారి. 8వ వేతన సంఘం ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ ఏడాది జనవరి 16న  వెల్లడించింది కేంద్రం. అయితే ఈ వేతన సంఘం సిఫార్సులు వచ్చే ఏడాది అమల్లోకి వస్తాయి. అందుకే దీపావళి టైంలో ప్రకటించే డీఏ కూడా ఏడో వేతన సంఘం కిందికే వస్తుంది. 8వ వేతన సంఘం సిఫార్సులు అమలులోకి వచ్చిన తర్వాత డీఏను బేసిక్ శాలరీలో కలిపేస్తారు. అప్పటి నుంచి మళ్లీ డీఏ సున్నా నుంచి ప్రారంభమవుతుందని ఉద్యోగ నేతలు చెబుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos