తెలుగురాష్ట్రాల్లో బుల్లితెర వీక్షకులను ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ సీజన్ 7 షో ను... నిర్వాహకులు ఉల్టా పుల్టా పేరుతో వ్యూయర్స్ ఊహకు అందని విధంగా నడిపిస్తున్నారు. అలాగే... ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ కూడా బిగ్ బాస్ కు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. ఫలితంగా... టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 6తో పోలిస్తే ... సీజన్ 7 లాంచ్ ఎపిసోడ్‌ను 40 శాతం అత్యధిక మంది ప్రేక్షకులు చూశారు. సీజన్ 7 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌ను 29 మిలియన్ల ప్రేక్షకులు వీక్షించారని సమాచారం. బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం ముందు నుండే ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడంతో లాంచ్ ఎపిసోడ్‌కు అంత ఆదరణ లభించిందని అనుకుంటున్నారు. మామూలుగా బిగ్ బాస్ రియాలిటీ షోపై వీక్షకులకు ఇంట్రెస్ట్ రావాలంటే కొన్ని ఎపిసోడ్స్ గడిచేవరకు రాదు. కానీ ఈసారి వీక్షకులకు అసలు గ్యాప్ ఇవ్వకుండా వెంటనే బిగ్ బాస్‌పై ఇంట్రెస్ట్ తీసుకురావడం కోసం మేకర్స్ బాగా కష్టపడ్డారు. వారి కష్టం ఫలించిందని టీఆర్‌పీలు చూస్తే అర్థమవుతోంది. బిగ్ బాస్ సీజన్ 7లో మొదటి వారం పూర్తయ్యే సమయానికి దాదాపు 5.1 కోట్లమంది వీక్షకులు దీనిని ఫాలో అయినట్లు తెలుస్తోంది. టీవీలో లాంచ్ ఎపిసోడ్‌ను దాదాపు 3 కోట్ల మంది చూశారు. డైలీ ఎపిసోడ్స్‌కు కూడా వ్యూవర్స్ పెరిగినట్లు సమాచారం. ఇదిలావుండగా... 7వ సీజన్ రెండో వారంలో ఒకరి కంటే ఎక్కువ మందినే హౌస్ నుంచి బిగ్‍బాస్ ఎలిమినేట్ చేస్తారని తెలుస్తోంది. ఇద్దరు హౌస్ నుంచి బయటికి వెళ్తారని వినిపిస్తోంది. అయితే, రెండో వారంలో అందరికీ టార్గెట్ అయి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‍గా మారిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‍ను బిగ్‍బాస్ ఎలిమినేట్ చేసినట్లు చేసి.. సీక్రెట్ రూమ్‍కు పంపుతారని టాక్ వినిపిస్తోంది. బిగ్‍బాస్ 3వ సీజన్‍లో రాహుల్ సిప్లిగంజ్‍ను ఇలాగే సీక్రెట్ రూమ్‍కు పంపారు. ఇప్పుడు 7వ సీజన్‍లో పల్లవి ప్రశాంత్‍ను ఆ రహస్య రూమ్‍కు పంపుతారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఇది ఎంత వరకు నిజమవుతుందనేది ఈ వీకెండ్ ఎపిసోడ్లలో తేలనుంది. ఒకవేళ సీక్రెట్ రూమ్‍కు పంపితే పల్లవి ప్రశాంత్‍కు స్క్రీన్ టైమ్ పెరిగి.. అతడికి మరింత ఆదరణ పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మరోవైపు, ఈ వారం బిగ్‍బాస్ హౌస్ నుంచి షకీల ఎలిమినేట్ అయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. వయసురీత్యా ఆమె హౌస్‍లో అంత యాక్టివ్‍గా ఉండలేకపోతున్నారు. టాస్కుల్లోనూ చురుగ్గా పాల్గొనలేకపోతున్నారు. అలాగే, ఓటింగ్‍లో కూడా వెనుకపడి ఉన్నారు. దీంతో ఆమె ఎలిమినేట్ అవుతారని తెలుస్తోంది. కాగా... బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్‍లో మరో సీరియల్ నటుడు రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అగ్నిసాక్షి సీరియల్ ఫేమ్ అంబటి అర్జున్ హౌస్‍లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఈ వారమే ఆయన రాక ఉంటుందేమో చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos