దేశవ్యాప్తంగా వాహన కొనుగోలుదారులకు శుభవార్త. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జీఎస్టీ 2.0 (వస్తు, సేవల పన్ను) సవరణలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త పన్ను విధానంతో కార్లు, ద్విచక్ర వాహనాల ధరలు భారీగా తగ్గాయి. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలన్నీ పన్ను తగ్గింపు ప్రయోజనాలను నేరుగా కస్టమర్లకు బదిలీ చేస్తుండటంతో, వాహన రంగంలో అతిపెద్ద ధరల తగ్గింపు నమోదవుతోంది. సాధారణ ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్‌లపై సుమారు రూ. 40,000 నుంచి మొదలుకొని, ప్రీమియం లగ్జరీ ఎస్‌యూవీలపై ఏకంగా రూ. 30 లక్షల వరకు ధరలు దిగిరావడం విశేషం. దీంతో కొత్త వాహనం కొనాలనుకునే వారికి ఇది సరైన సమయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారతదేశంలో దాదాపు 98 శాతం మార్కెట్ వాటా ఉన్న 350 సీసీ లోపు స్కూటర్లు, మోటార్‌సైకిళ్లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. దీంతో హీరో స్ప్లెండర్, హోండా యాక్టివా, బజాజ్ పల్సర్, టీవీఎస్ అపాచీ, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 వంటి అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్ల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. హోండా తన యాక్టివాపై సుమారు రూ. 7,874, సీబీ350 బైక్‌పై రూ. 18,887 వరకు తగ్గింపును ప్రకటించింది.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos