ఈరోజు అంటే ఆగస్టు 22వ తేదీ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. 68వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్త్‌డే సందడి నెలకొంది. లక్షలాది మంది అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 'అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు' అంటూ పవన్ కళ్యాణ్ భావోద్వేగ పూరితంగా మెసేజ్ ను ట్వీట్ చేశారు. 'అన్నయ్య చిరంజీవికి ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీ తమ్ముడిగా పుట్టి మిమ్మల్ని అన్నయ్య అని పిలిచే అదృష్టాన్ని కలిగించినందుకు ఆ భగవంతుడికి ముందుగా కృతజ్ఞతలు చెబుతున్నాను. ఒక సన్నని వాగు అలా ప్రవహిస్తూ మహానదిగా మారినట్లుగా మీ ప్రయాణం నాకు గోచరిస్తోంది. మీరు ఎదిగి మేము ఎదగడానికి ఒక మార్గం చూపడమే కాకుండా లక్షలాదిమందికి స్ఫూర్తిగా నిలిచిన మీ సంకల్పం, పట్టుదల, శ్రమ, నీతినిజాయతీ, సేవాభావం నా వంటి ఎందరికో ఆదర్శం. కోట్లాదిమంది అభిమానాన్ని మూటగట్టుకున్నా కించిత్ గర్వం కూడా మీలో కనిపించకపోవడానికి మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరే కారణం. చెదరని వర్చస్సు, వన్నె తగ్గని మీ అభినయ కౌశలంతో సినీ రంగాన అప్రతిహతంగా మీరు సాధిస్తున్న విజయాలు అజరామరమైనవి. ఆనందకరం, ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆయుష్షుతో, మీరు మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే అన్నయ్య' అంటూ పవన్ ట్వీట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు గ్రామంలో కానిస్టేబుల్ కొణిదెల వెంకటరావు - అంజనాదేవి దంపతులకు 1955 ఆగస్టు 22న చిరంజీవి జన్మించారు. ఆయన అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. కానిస్టేబుల్‌ అయిన తన తండ్రి వృత్తిరీత్యా తరచుగా బదిలీ అవుతుంటారు కాబట్టి, ఆయన బాల్యం స్వగ్రామంలో తాతయ్యలతో గడిపాడు. నిడదవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తూరులలో పాఠశాల విద్యను అభ్యసించారు. ఒంగోలులోని సీఎస్ఆర్  శర్మ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివారు. నర్సాపురంలోని శ్రీ వైఎన్ కాలేజీలో కామర్స్ లో డిగ్రీ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి కలిగి ఉన్న చిరు.. యాక్టింగ్ నేర్చుకోడానికి 1976లో మద్రాసు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. చిరంజీవి 'పునాదిరాళ్లు' సినిమాతో తన సినీ కెరీర్‌ని ప్రారంభించారు. కానీ 'ప్రాణం ఖరీదు' చిత్రం ముందుగా విడుదలైంది. 1978 లో ఆ చిత్రం విడుదలైంది. అదే ఆయన్ను తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఆ తరువాత 'పునాదిరాళ్లు' 1979లో రిలీజ్ అయింది. 'మన వూరి పాండవులు' సినిమా నటుడిగా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనూ నటించారు. 'ఐ లవ్ యూ' 'ఇది కథ కాదు' 'మోసగాడు' 'రాణి కాసుల రంగమ్మ' '47 రోజులు' 'న్యాయం కావాలి' వంటి చిత్రాలలో ప్రధాన ప్రతినాయకుడిగా మెప్పించారు. ఆ తరువాత ఒక్కోస్టెప్ పైకి ఎదుగుతూ... మెగాస్టార్ స్థాయికి చేరుకుని నేడు తెలుగు సినీ ప్రపంచంలో ఎదురులేని ధ్రువతారగా వెలుగొందుతున్నారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా గడపాలని టాలీవుడ్ వర్గాల వారు, కోట్లాదిమంది అభిమానులు మనసారా కోరుకుంటున్నారు. హ్యాపీ బర్త్ డే చిరు అంటూ మనం కూడా విషెష్ చెప్పేద్దామా మరి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos