గతంలో పెళ్లైన కొత్త జంటలు వెంటనే పిల్లల్ని కనొద్దని చెప్పిన తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇప్పుడు మాట మార్చారు. పెళ్లి చేసుకున్న వారంతా వెంటనే పిల్లల్ని కనాలని సూచించారు. అంతేకాకుండా వారికి మంచి తమిళ్ పేర్లు పెట్టమని కూడా వివరించారు. ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలంతా షాక్ అవుతున్నారు. ఇంత అత్యవసరంగా పిల్లల్ని కనమని సీఎం ఎందుకు చెబుతున్నారని తెలుసుకునే పనిలో పడ్డారు.

లోక్‌సభ నియోజకవర్గ పునర్విభజన విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చాలా రోజులుగా కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. జనాభా ప్రతిపాదికన మాత్రమే నియోజక వర్గాలను నిర్ణయిస్తే రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలు తగ్గిపోతాయని ఆందోళ చెందుతున్నారు. ఇదే విషయమై మరోసారి స్పందించిన సీఎం ఎంకే స్టాలిన్ షాకింగ్ కామెంట్లు చేశారు. పునర్విభజనతో నష్టం జరగకుండా ఉండాలంటే ఒకే ఒక్క ప్లాన్ ఉందని చెప్పారు. ఆయన నాగపట్నంలోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ ప్లాన్ గురించి వివరించారు.

గతంలో కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు కాస్త ఆలస్యంగా పిల్లల్ని కనమని చెప్పానని.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయని.. నియోజక వర్గాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోందని.. అందుకే తాను గతంలో చెప్పిన మాటను మార్చుకుంటున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. గతంలో తాము కుటుంబ నియంత్రణపై మాత్రమే దృష్టి సారించామని కానీ ఇప్పుడు రాష్ట్ర జనాభాను పెంచుకోక తప్పని పరిస్థితుల్లో పడ్డామని వివరించారు.

అందుకే రాష్ట్ర జనాభా పెరిగేందుకు తాను ఇలా సూచిస్తున్నానని.. కొత్తగా పెళ్లైన జంటలు అన్నీ వెంటనే పిల్లల్ని కనాలని అన్నారు. వారికి మంచి తమిళ్ పేర్లు కూడా పెట్టాలని చెప్పుకొచ్చారు. నేరుగా ముఖ్యమంత్రియే ఈ కామెంట్లు చేయడంతో అంతా ఆశ్చర్యం చెందుతున్నారు.  కొందరేమో లోక్‌సభ స్థానాల కోసం తాము వెంటనే పిల్లల్ని కంటామని చెబుతుండగా.. మరికొందరు కష్టం సార్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ముఖ్యమంత్రి ఇలాంటి కామెంట్లు చేయడం ఇదే తొలిసారి కాదు. ఇటీవలే ఓ పెళ్లికి వెళ్లిన ముఖ్యమంత్రి.. అక్కడ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. పరిమితంగా పిల్లల్ని కని సంపదతో జీవించాలనే ఉద్దేశంతో మొన్న మొన్నటి వరకు కుటుంబ నియంత్రణ ప్రచారాన్ని చేపట్టామని.. కానీ దీనివల్ల నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు లోక్‌సభ స్థానాలు తగ్గే అవకాశం ఏర్పడిందన్నారు. ఈ నెల 5వ తేదీన ఈ అంశంపై చర్చించేందుకు సీఎం అఖిలపక్ష సమావేశానికి కూడా పిలుపునిచ్చారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos