ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ చేపట్టిన విజయవాడ ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. కస్టడీ పిటిషన్ పై సీఐడీ మెమో దాఖలు చేసిన తర్వాత విచారణ జరుపుతామని చెప్పింది. రేపు కస్టడీ పిటిషన్, బెయిల్ పిటిషన్ పై వాదనలు విన్న తర్వాత... రెండింటిపై ఒకేసారి ఆదేశాలను వెలువరిస్తామని తెలిపింది. ఈ రెండు పిటిషన్లపై దేన్ని ముందు విచారించాలో రేపు నిర్ణయిస్తామని వెల్లడించింది.
బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టాలని చంద్రబాబు లాయర్లు పట్టుపట్టగా, సీఐడీ లాయర్లు కస్టడీ పిటిషన్లపై విచారణ చేపట్టాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని కోరారు. ఈ నెల 14న బెయిల్ పిటిషన్ వేశామని ముందు ఈ పిటిషన్ విచారించాలని ... కస్టడీ పిటిషన్ పై సీఐడీ వేసిన మెమోపై నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు లాయర్లు పదేపదే న్యాయమూర్తిని అడిగారు. దీంతో... మెమో ఇంకా తన దగ్గరకు రాకుండా ఎలా నిర్ణయం తీసుకుంటానంటూ న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కస్టడీ పిటిషన్ విచారణలో ఉండగా బెయిల్ పిటిషన్ విచారణ జరగదని పలు కేసులను సీఐడీ తరఫు లాయర్లు ఏసీబీ కోర్టులో ప్రస్తావించారు.
చంద్రబాబును అక్టోబర్ 5 వరకు మరో 11 రోజులవరకు రిమాండ్ విధించడం తెలిసిందే. మరోవైపు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు రేపు నిర్ణయం వెల్లడించనున్న క్రమంలో... క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో మెన్షన్ అయింది. సోమవారం ఉదయం చంద్రబాబు తరపున అడ్వొకేట్ సిద్దార్థ లూథ్రా దీని ప్రస్తావన తీసుకొచ్చారు.
చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారని, అత్యవసరంగా విచారణ చేపట్టాలని లూథ్రా కోరారు. ఎన్ని రోజుల నుంచి రిమాండ్‌లో ఉన్నారని సీజేఐ ప్రశ్నించగా... లూథ్రా వివరాలు చెప్పారు. రేపు మరోసారి మెన్షన్ చేయాలని సీజేఐ చంద్రచూడ్ సూచించారు. ఇదే కేసులో వివిధ కోర్టుల్లో కూడా పిటిషన్లు వేసినట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో వరుస పిటిషన్లు వేశారు. సుప్రీంకోర్టులో సిద్ధార్థ లూథ్రా, ఏసీబీ కోర్టులో ప్రమోద్ దూబే వాదిస్తున్నారు. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టుకి సెలవులు ఉన్నాయి ఈ లోపే తేల్చుకోవాలని టీడీపీ తరఫున లాయర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 28న మిలాదున్ నబీ, 29న ఢిల్లీ లోకల్ హాలిడే ఉంది. 30న శనివారం, అక్టోబర్ 1న ఆదివారం వచ్చింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి సెలవు ఉంది.
ఈ క్రమంలో సుప్రీంకోర్టులో చంద్రబాబు తరుపు వాదిస్తున్న లాయర్లు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. 284 పేజీలతో కూడిన పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వాన్ని, అజాయకల్లాంను చేర్చారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos