దేశ రాజధాని దిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా షెడ్యూల్‌ ప్రకటించనప్పటికీ రాజకీయ వేడి మాత్రం రాజుకుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తున్నాయి. తాజాగా బీజేపీ దిల్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.

న్యూదిల్లీ స్థానంలో ఆప్‌ జాతీయ కన్వీనర్‌, మాజీ సీఎం కేజ్రీవాల్‌కు పోటీగా మాజీ ఎంపీని బీజేపీ బరిలో దింపింది. తొలి జాబితాలో 29 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. న్యూదిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ పర్వేశ్‌వర్మ పేరును ఖరారు చేసింది. ఇదే స్థానం నుంచి ఆప్ నేత కేజ్రీవాల్‌ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ కూడా ఈ స్థానానికి మాజీ సీఎం షీలాదీక్షిత్‌ కుమారుడు సందీప్‌ దీక్షిత్‌ పేరును ప్రకటించింది. దీంతో ఈసారి ఎన్నికల్లో న్యూదిల్లీ నియోజకవర్గ పోరు ఆసక్తికరంగా మారింది. దిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్‌ సింగ్ వర్మ కుమారుడైన పర్వేశ్‌ వర్మ 2014 నుంచి 2024 వరకు పశ్చిమ దిల్లీ నుంచి లోక్‌సభ సభ్యుడిగా కొనసాగారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఈయన రికార్డు స్థాయిలో 5.78 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దిల్లీ చరిత్రలో ఓ లోక్‌సభ అభ్యర్థి సాధించిన అత్యధిక మెజార్టీ ఇదే కావడం విశేషం.

ఇక, దిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీకి పోటీగా కల్కాజీ స్థానం నుంచి మరో మాజీ ఎంపీ రమేశ్‌ బిధూడీని నిలబెట్టింది. 70 శాసనసభ స్థానాలు ఉన్న దిల్లీ ప్రస్తుత అసెంబ్లీ గడువు ఈ ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది. మరికొన్ని రోజుల్లో ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆమ్‌ఆద్మీ పార్టీ మొత్తం అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. కాంగ్రెస్‌ కూడా కొంతమందిని ప్రకటించింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos