ఏపీ సమీపంలోని పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడిన క్రమంలో... రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడురోజులపాటు పలుజిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మూడు రోజులు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 4వ తేదీ వరకు వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నందున... వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో 2, 3,4 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని, ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.  తెలంగాణ లోని ఆదిలాబాద్‌, కొమరం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దక్షిణ కోస్తాలోని కొన్ని జిల్లాల్లోనూ, రాయలసీమలోనూ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. రాయలసీమలో ముఖ్యంగా సత్యసాయి, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. అదేవిధంగా... ఉత్తరాంధ్ర జిల్లాల్లో మారేడుమిల్లి - రంపచోడవరం - పోలవరం - యేలేశ్వరం ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా... ఆగస్టు లో హైదరాబాద్ తోపాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. అయితే, సెప్టెంబర్ లో మాత్రం వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ వర్షాకాల సీజన్ లోనే వర్షాలు తక్కువగా ఉన్నాయని.. మొత్తంగా చూసుకుంటే సాధారణ వర్షపాతమే నమోదైందని పేర్కొంది. అయితే, సెప్టెంబర్ నెలలో మాత్రం చాలా ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos