బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడింది. దీని ప్రభావం మూడు రాష్ట్రాలపై పడే అవకాశం ఉంది. కేరళ, కర్ణాటక, తమిళనాడు సహా కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆగ్నేయదిశగా బంగాళాఖాతం ఉపరితలంపై ఏర్పడిన ఆవర్తనం సుమారు 2.5 కిలోమీటర్ల ఎత్తున వ్యాపించివుంది. ఇది మరింత బలపడగా... సముద్రం మీదుగా వీస్తున్న బలమైన ఈస్టర్లీ విండ్స్ దీనికి తోడయ్యాయి. ఫలితంగా ఆవర్తనం మరింత విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ చెబుతోంది.
ఈ ప్రభావంతో ఈస్టర్లీ విండ్స్ వేగం గంటకు 35 నుండి 45 కిలో మీటర్ల వరకు ఉండొచ్చు. గంటకు 55 కిలో మీటర్ల వరకకూ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దక్షిణ తమిళనాడు తీర ప్రాంతాలు, గల్ఫ్ ఆఫ్ మన్నార్, బంగాళాఖాతంలో నైరుతి- దక్షిణ ప్రాంతాల్లో బలమైన తూర్పు ఈదురు గాలులు వీస్తాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఈ నెల 13, 14 తేదీల్లో బెంగళూరులో ఓ మోస్తరు వర్షపాతం నమోదువుతుందని, దక్షిణ కర్ణాటక, తీర ప్రాంత జిల్లాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు పడొచ్చని ఐఎండీ అధికారులు చెబుతున్నారు.
కేరళలో 10 జిల్లాలకు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. తిరువనంతపురం, కొల్లం, పథనంథిట్ట, అళప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, పాలక్కాడ్, మళప్పురం, వాయనాడ్ జిల్లాల్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడొచ్చు. అటు తమిళనాడు వ్యాప్తంగా 12వ తేదీ వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. పుదుచ్చేరి, కరైకల్‌ల్లోనూ ఇదే తీవ్రత కనిపించే అవకాశాలు లేకపోలేదని అంచనా వేసింది. అదే సమయంలో చలి తీవ్రత భారీగా పెరుగుతుందని ఐఎండీ పేర్కొంది. ఈ ప్రభావంతో ఏపీ రాష్ట్రవ్యాప్తంగా స్వల్ప ఈదురు గాలులతో ఆకాశం మేఘావృతమై ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos