ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ కుప్పకూలడంతో విషాదం నెలకొంది. ఉత్తరకాశీ జిల్లాలో గంగననికి సమీపంలో ఒక హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. హెలికాప్టర్‌ కుప్పకూలిన ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న 5 మంది టూరిస్టులు మృతిచెందగా, మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరకాశీ జిల్లా ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు.  ప్రయాణికులతో డెహ్రాడూన్ నుంచి హర్షిల్ హెలిప్యాడ్‌కు బయలుదేరిన విమానం గంగాననికి సమీపంలో కూలిపోయింది.. గంగననికి సమీపంలోని నాగ మందిరం దగ్గర్లో భాగీరథి నదికి అతి సమీపంలో హెలికాప్టర్ ప్రమాదానికి గురైందని సమాచారం.

ఈ ప్రమాదం పై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారికి సంతాపం ప్రకటించారు. మృతులు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంబంధిత జిల్లా అధికారులు, రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకున్నారని చెప్పారు. గాయపడిన వారికి మెరుగైన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. హెలికాప్టర్ ప్రమాదంపై దర్యాప్తు చేయాలని అధికారులను సీఎం పుష్కర్ సింగ్ దామి ఆదేశాలు జారీ చేశారు. అధికారులను అడిగి ఘటన వివరాలపై ఆరా తీశారు. పరిస్థితిని పర్యవేక్షించాలని అధికారులకు సూచించినట్లు తెలుపుతూ పోస్ట్ చేశారు.

ఘటనా స్థలానికి SDRF, పోలీసులు, విపత్తు నిర్వహణ బృందం, అంబులెన్స్ చేరుకున్నాయి. గురువారం ఉదయం 9 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. హెలికాప్టర్ ప్రైవేట్ కంపెనీదని..  ఈ ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందించేందుకు సమీపంలోని ఆసుపత్రికి తరలించారని సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియ రాలేదు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos