దేశవ్యాప్తంగా మళ్లీ ఎన్నికల వాతావరణం పుంజుకుంటుంది. భీమిలి ఎన్నికలపై తీవ్ర చర్చ నడుస్తుండటమే కాకుండా నవంబర్లో మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో ఇప్పుడు సర్వత్రా ఆ ఎన్నికలపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఎందుకంటే ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీకి ఎదుటి దెబ్బ తగిలితే జాతీయ రాజకీయాలలో కొత్త పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంచితే... బీహార్ ఉపఎన్నికల్లో పోటీకి ప్రశాంత్ కిషోర్ తన పార్టీని రెడీ చేశారు. జన సురాజ్ పేరుతో పార్టీ పెట్టిన ఆయన నేరుగా అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు ముందే తన పార్టీ బలాన్ని ప్రజలకు… బయట ప్రపంచానికి చూపించాలనుకుంటున్నారు. అందుకే నాలుగు స్థానాల ఉపఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించిన వెంటనే అభ్యర్థులను కూడా ఖరారు చేశారు. ఆప్ తరహాలో చదువుకున్న వారిని, జనాల్లో పని చేసే వారిని ఎంపిక చేసుకుంటున్నారు.

ఎన్నికల స్ట్రాటజిస్టుగా ప్రశాంత్ కిషోర్‌కు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. అయితే స్ట్రాటజిస్టులు రాజకీయాలు చేయలేరని అనుకుంటారు. దాన్ని తప్పని నిరూపించాలని ఆయన అనుకుంటున్నారు. స్ట్రాటజిస్టుగా తనకు వచ్చిన క్రేజ్ ను బట్టి ఆయన నితీష్ కుమార్ వారసుడిగా జేడీయూలోకి అడుగు పెట్టారు. కానీ అక్కడి రాజకీయాలను తట్టుకోలేక బయటకు వచ్చారు. అప్పుడే ఆయనను ఎగతాళి చేశారు. మళ్లీ ఆయన కొన్నాళ్ల తర్వాత సొంత పార్టీ పెట్టుకున్నారు.

జనసురాజ్ పేరుతో మొదట ఓ సంస్థను పెట్టి పాదయాత్రను చేశారు. మధ్యలో కాలి గాయం కారణంగా వదిలేశారు. తర్వాత జన సురాజ్ ను పార్టీగా మార్చారు. ఇప్పుడు ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కనీసం ఒక్క సీటులో గెలిచినా ఆయన పార్టీకి మంచి భవిష్యత్ ఉంటుంది. గెలుపు ఓటముల్ని నిర్దేశించే స్థాయిలోను ఓట్లను చీల్చినా పీకే రాజకీయాల్లో ముద్ర వేయగలుగుతారు. అందు కోసం తన స్ట్రాటజీలను పూర్తి స్థాయిలో ప్రయోగించబోతున్నారు. ఏం జరుగుతుందో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos