ఎయిరిండియా విమానం కూలిపోయిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తును ముమ్మరం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు సంభవించకుండా ఎలాంటి ముందుజాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై కసరత్తు మొదలుపెట్టింది. దీనికోసం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. దేశ రాజధానిలో ఇవాళ ఈ కమిటీ ఏర్పాటైంది. పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దీనికి అధ్యక్షత వహించారు. ఈ భేటీలో గుజరాత్ ప్రభుత్వం, డీజీసీఏ అందించిన నివేదికలపై చర్చించారు. 

అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ... విమానం కూలిపోయిన ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోవడం ఎంత బాధాకరమో తనకు బాగా తెలుసునని, రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయానని గుర్తు చేసుకున్నారు. విమానం కూలిందనే విషయం తెలిసిన వెంటనే షాక్ కు గురయ్యానని, అప్పటికప్పుడు సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లానని చెప్పారు. అప్పటికే గుజరాత్ ప్రభుత్వం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉందని, ప్రతి కుటుంబానికీ న్యాయం చేస్తామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.  విమాన శిథిలాల నుండి బ్లాక్ బాక్స్‌ను వెలికితీయడం.. దర్యాప్తు ప్రక్రియకు అత్యం కీలకమని ఆయన అన్నారు. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వెంటనే రంగంలోకి దిగిందని, శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. అనంతరం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా మాట్లాడారు. విమానం కూలిపోయిందనే సమాచారం జూన్ 12వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు అందిందని, వెంటనే అహ్మదాబాద్ ఏటీసీని సంప్రదించి పూర్తి సమాచారాన్ని సేకరించామని తెలిపారు. 

ఈ విమానం మధ్యాహ్నం 1:39 నిమిషాలకు టేకాఫ్ తీసుకుందని, కొన్ని సెకన్లలో దాదాపు 650 అడుగుల ఎత్తుకు చేరుకుందని వివరించారు. ఆ తర్వాత, అది కిందికి జారడం మొదలుపెట్టిందని, ఆ వెంటనే పైలెట్ అహ్మదాబాద్ ఏటీసీకి మే డే కాల్ చేశారని వివరించారు. విమానంతో కాంటాక్ట్ కావడానికి ప్రయత్నించగా ఎటువంటి స్పందన రాలేదని, సరిగ్గా ఒక నిమిషం తర్వాత, ఈ విమానం ఎయిర్ పోర్ట్ నుండి రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న మేధానినగర్‌లో కూలిపోయిందని సమీర్ కుమార్ సిన్హా పేర్కొన్నారు. ఫ్లైట్ కెప్టెన్స్ సుమిత్ సభర్వాల్, క్లైవ్ సుందర్.. అంతకుముందు పారిస్ - ఢిల్లీ - అహ్మదాబాద్ ఫ్లైట్ ను నడిపినట్లు తెలిపారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos