మణిపూర్‌లో భరతమాతను హత్య చేసిన బీజేపీ ప్రభుత్వ పెద్దలు దోశద్రోహులే కానీ, దేశభక్తులు కాదని కాంగ్రెస్ నేత రాహుల్ తీవ్రంగా ధ్వజమెత్తారు... అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ వ్యవహార శైలిపై... ఆయన విరుచుకుపడ్డారు. నెలల తరబడి మణిపూర్ మండుతుంటే ఆ అంశంపై చర్చలో పాల్గొన్న ప్రధాని నవ్వులు చిందిస్తూ... జోక్‌లు వేశారని... ప్రధాని హోదాకు ఇది తగదని ఆయన అన్నారు.
ప్రధాని మోదీ అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో దాదాపు రెండు గంటల పాటు ప్రసంగిస్తూ... కాంగ్రెస్ సహా విపక్ష కూటమిపై విమర్శలు చేశారు. ముఖ్యంగా రాహుల్‌ గాంధీపై సెటైర్లు వేశారు. మణిపూర్‌ అంశంపైనా ప్రకటన చేశారు. మోదీ స్పీచ్‌ని ఇప్పటికే విపక్షాలు ఖండించగా...ఇప్పుడు రాహుల్ స్పందించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో ప్రధానిపై విమర్శలు చేశారు. మణిపూర్‌ మంటల్లో తగలబడిపోతున్నా...మోదీ వాటిని చల్లార్చే ప్రయత్నం చేయలేదని అన్నారు. మణిపూర్‌లో భరత మాతను హత్య చేశారన్న వ్యాఖ్యలపై దుమారం రేగినప్పటికీ... రాహుల్ అవే వ్యాఖ్యల్ని మరోసారి చేశారని... ఎంతో ఆవేదనతో ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని వివరించారు.
రెండు గంటల పాటు ప్రసంగించిన ప్రధాని...జోక్‌లు వేయడం, నవ్వడం తప్ప మరేమీ చేయలేదని రాహుల్ విమర్శించారు. మణిపూర్‌లో హింసను ఎలా అదుపులోకి తీసుకురావాలన్నదే అసలైన చర్చ అని... అది తప్ప అన్నీ మాట్లాడారని రాహుల్ అసహనం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో భరతమాత గురించి మాట్లాడడం కూడా తప్పైపోయిందని రాహుల్ అన్నారు.
ప్రధానికి మణిపూర్‌ని కాపాడే ఉద్దేశమే లేదని తేల్చి రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. ప్రధాని ... ఆ రాష్ట్రానికి ఒక్కసారైనా వెళ్లి ఉండాల్సిందని అన్నారు. మణిపూర్‌ను సైన్యం అదుపులోకి తీసుకోవాలని తాను కోరినప్పుడు బీజేపీ తనను విమర్శించిందని ... మణిపూర్‌పై అసలు చర్చలే జరగలేదని, కేవలం హింస మాత్రమే చోటచేసుకుందని ఆయన విమర్శించారు. హింసను మొదట అదుపు చేసి, ఆ తర్వాత దానికి చరమగీతం పాడాల్సి ఉంటుందన్నారు.
ప్రధాని వద్ద ఇందుకు అవసరమైన అన్ని అస్త్రాలు ఉన్నప్పటికీ ఆయన వాటిని వాడలేదని, చేసిందేమీ లేకపోగా నవ్వులు చిందిస్తున్నారని తప్పుపట్టారు. మీడియాను కేంద్రం అదుపులో పెట్టుకుందనే విషయం నాకు తెలుసునని...  రాజ్యసభ, లోక్‌సభ టీవీని వారు అదుపులో పెట్టుకున్నారని రాహుల్ అన్నారు. అయినప్పటికీ  ... నా పని నేను చేసుకుంటూ పోతానని చెప్పారు. భరతమాతపై ఎక్కడ దాడి జరిగినా ... నేను... అక్కడ ఉంటానని, భరత మాత పరిరక్షణకు కట్టుబడి ఉంటానని రాహుల్ అన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos