చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్ లో నిర్వహిస్తున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కోసం పార్టీ సీనియర్ నాయకులు నగరానికి చేరుకున్నారు.  పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలో సీడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, సీనియర్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పూర్వ అద్యక్షులు మొత్తం 84 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. అతిథులకు ప్రత్యేక ఆహ్వానం పలికేందుకు తాజ్ కృష్ణ హోటల్ వద్ద కాంగ్రెస్ పార్టీ గుస్సాడి, ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శనలను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కళాకారులు తమ కళను ఉత్సాహంగా ప్రదర్శిస్తుండగా ములుగు ఎమ్మెల్యే సీతక్క వారితో కలిసి నృత్యం చేయడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఆదివాసీల నృత్యం అయిన గుస్సాడి నృత్యం చేసి అక్కడున్నవారిలో ఎమ్మెల్యే సీతక్క జోష్ నింపి కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇదిలావుండగా...
రేపు సాయంత్రం అంటే 17వ తేదీ సాయంత్రం... తుక్కుగూడా లో జరిగే బహిరంగ సభలో తెలంగాణ ప్రజలకు వరంగా సోనియాగాంధీ 6 గ్యారంటీలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాగా... కాంగ్రెసు పార్టీ ఈరోజు, రేపు నిర్వహిస్తున్న కార్యక్రమాలు, సమావేశాల సందర్భంగా అగ్రశ్రేణి నాయకులు నగరానికి వచ్చిన నేపథ్యంలో సంబంధిత ప్రాంతాలలో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos