కేంద్ర హోం మంత్రి అమిత్‌షా క్షమాపణలు చెప్పాలంటూ ప్రతిపక్ష కూటమి ఇండియా బ్లాక్ బుధవారం పార్లమెంట్ ఆవరణలో చేపట్టిన నిరసన రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక సహా పలువురు ఎంపీలు ఈ నిరసనలో పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటాలను చేత పట్టి జై భీమ్ అంటూ నినాదాలు చేశారు. అమిత్‌షా క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, వామపక్షాలతో పాటు ఆర్‌జేడీ, డీఎంకే, ఆప్ పార్టీలు ఆందోళన చేపట్టాయి.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ మనుస్మృతిని విశ్వసించే వారు అంబేద్కర్‌తో విభేదించినట్లేనని మండిపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సామాజిక మాధ్యమైనా ఎక్స్ వేదికగా హోం మంత్రిపై మండిపడ్డారు. హోం మంత్రి అమిత్ షా ... బాబాసాహెబ్‌ను అవమానించడం ద్వారా బీజేపీ - ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ పతాకానికి వ్యతిరేకమని, ఆ పార్టీ పెద్దలు ఆశోక చక్రాన్ని వ్యతిరేకించారని మరోసారి రుజువైందని విరుచుకుపడ్డారు. భారత రాజ్యాంగానికి బదులు మనుస్మృతిని తొలిరోజు నుండే అమలు చేయాలని సంఫ్‌పరివార్ భావిస్తోందని అన్నారు.
‘నాలాంటి కోట్లాది మంది ప్రజలకు అంబేద్కర్ భగవంతుడి కంటే తక్కువేమీ కాదని... దళితులు, గిరిజనులు, మైనారిటీలు, వెనుకబడిన తరగతులు , పేదలకు ఆయన ఎప్పటికీ గొప్పవాడేననే విషయాన్ని బీజేపీ నేతలు అర్థం చేసుకోవాలని ఖర్గే పేర్కొన్నారు. కాగా విపక్షాల నిరసన రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos