మార్చిలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి... త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు ఎదుర్కొనాల్సిఅరగనున్న క్రమంలో... ఇండియా కూటమికి బిగ్ షాక్ తగిలింది. ఈ అలయెన్స్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌తో సీట్ల పంపకాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్- కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలపై కొద్దిరోజులుగా చర్చలు సాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 42 లోక్‌సభ స్థానాలు ఉండగా.. వాటి పంపకాలపై ఈ రెండు పార్టీల మధ్య వరుసగా సమావేశాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న 42 లోక్‌సభ స్థానాల్లో రెండింటిని మాత్రమే కాంగ్రెస్‌కు ఇస్తామని తృణమూల్ స్పష్టం చేసింది. కాంగ్రెస్ మాత్రం ఎనిమిది నుంచి 14 స్థానాలను డిమాండ్ చేస్తోంది. దీనిపై ఈ రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరట్లేదు. చర్చలు కొలిక్కి రావడం లేదు. రెండు లోక్‌సభ స్థానాలను మాత్రమే తీసుకోవడానికి  కాంగ్రెస్ అంగీకరించట్లేదు. ఈ నేపథ్యంలో మమత బెనర్జీ కీలక నిర్ణయాన్ని తీసుకొని... వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని తేల్చి చెప్పారు. ఎలాంటి పొత్తులూ ఉండబోవని స్పష్టం చేశారు. సీట్ల పంపకాల విషయంలో తాము పెట్టిన ప్రతిపాదనలను కాంగ్రెస్ అంగీకరించట్లేదని, వారు పెట్టిన డిమాండ్లకు అంగీకరించడానికి తాముు సిద్ధంగా లేమని అన్నారు. దీంతో ఆదిలోనే హంసపాదు అన్నట్లు... ఇండియా కూటమికి ఇంకా ఎన్నికల దాకా వెళ్ళక ముందే పెద్ద షాక్ తగిలినట్లు అయింది.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos