భారతీయ రైల్వే ప్రయాణికులకు కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది. టికెట్ల రద్దు, బోర్డింగ్ స్టేషన్ మార్పునకు సంబంధించి నిబంధనలను సవరించింది. టికెట్ల బ్లాక్ మార్కెటింగ్‌లో దళారుల దందాకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రయాణికులకు మరింత సౌలభ్యం కల్పించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్టు రైల్వే శాఖ వెల్లడించింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య దశలవారీగా అమల్లోకి రానున్నాయి. టికెటింగ్ విధానంలో దళారులు చేస్తున్న మోసాలను అరికట్టేందుకే రీఫండ్ నిబంధనలను కఠినతరం చేసినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. "కొంతమంది దళారులు ముందుగానే పెద్ద సంఖ్యలో టికెట్లను బ్లాక్ చేసి, అమ్ముడుపోని వాటిని రైలు బయల్దేరడానికి కొద్దిసేపటి ముందు రద్దు చేసి రీఫండ్ పొందుతున్నారు. దీనివల్ల నిజమైన ప్రయాణికులకు టికెట్లు దొరకడం లేదు. కొత్త నిబంధనలతో ఇలాంటి వాటికి చెక్ పెట్టవచ్చు" అని ఆయన వివరించారు.

కొత్త రద్దు నిబంధనలు ఏమిటంటే ... సవరించిన నిబంధనల ప్రకారం.. టికెట్ రద్దు చేసుకునే సమయాన్ని బట్టి రీఫండ్ మొత్తం ఆధారపడి ఉంటుంది. రైలు బయల్దేరడానికి 72 గంటల కంటే ముందు కన్ఫర్మ్ టికెట్‌ను రద్దు చేసుకుంటే, నామమాత్రపు క్యాన్సిలేషన్ ఛార్జీలు మినహాయించి గరిష్ఠ‌ రీఫండ్ లభిస్తుంది.72 గంటల నుంచి 24 గంటల మధ్య రద్దు చేసుకుంటే, టికెట్ ధరలో 25 శాతం కోత విధిస్తారు.24 గంటల నుంచి 8 గంటల లోపు రద్దు చేస్తే టికెట్ ధరలో 50 శాతం కోత పడుతుంది.ఇకపై రైలు బయల్దేరడానికి 8 గంటల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు టికెట్‌ను రద్దు చేసుకుంటే ఎలాంటి రీఫండ్ ఇవ్వరు.

మరోవైపు ప్రయాణికులకు ఊరట కల్పిస్తూ బోర్డింగ్ స్టేషన్ మార్పు నిబంధనను సరళతరం చేశారు. కొత్త రూల్ ప్రకారం రైలు షెడ్యూల్ సమయానికి 30 నిమిషాల ముందు వరకు ప్రయాణికులు తమ బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకోవచ్చు. ప్రస్తుతం చార్ట్ సిద్ధం కాకముందు మాత్రమే ఈ మార్పునకు అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై వంటి బహుళ స్టేషన్లు ఉన్న నగరాల్లోని ప్రయాణికులకు ఈ కొత్త నిబంధన ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos