ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నగరంలో అర్బన్ రోప్ వేలను ఏర్పాటు చేశారు.  కొన్ని రోజుల కిందట ఈ రోప్ వే ట్రయల్ రన్ ను ప్రారంభించారు. మూడు నెలల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. ఇది అమల్లోకి వస్తే వారణాసి నగరంలో రోడ్డు రవాణాకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడనుంది. రద్దీని తగ్గించి, వివిధ ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచుతుందని అధికారులు చెబుతున్నారు. దీనిపై నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్ మెంట్ లిమిటెడ్ (ఎన్ హెచ్ఎల్ఎంఎల్) ప్రాజెక్ట్  మాట్లాడుతూ... ఇది రూ.807 కోట్ల విలువైన ప్రాజెక్టు అని వెల్లడించారు. నగర రవాణాను మెరుగుపర్చడమే కాకుండా, ట్రాఫిక్ రద్దీని కూడా తగ్గిస్తుందని తెలిపారు. ప్రస్తుతం కాంట్, రథ్ యాత్ర ప్రాంతాల మధ్యన 3.75 కిలోమీటర్ల దూరానికి ఒక గండోలా (రోప్ వే తొట్టె)ను తిప్పుతున్నామని వివరించారు. 15 నిమిషాల్లో గమ్యం చేరుకోవచ్చని తెలిపారు. రానున్న రోజుల్లో ట్రయల్ రన్ లో భాగంగా మరిన్ని గండోలాలు తిప్పుతామని వెల్లడించారు. ఇప్పటికే రోప్ వే ట్రాన్స్ పోర్టు కోసం కాంట్, విద్యాపీఠ్, రథ్ యాత్ర వద్ద స్టేషన్లు నిర్మించారు. ఎస్కలేటర్లు, లిఫ్టులు, వీల్ చెయిర్ ర్యాంపులు, రెస్ట్ రూములు, పార్కింగ్ ఏరియాలు, ఫుడ్ కోర్టులు, కేఫ్ లు, దుకాణాలు కూడా ఈ స్టేషన్లలో ఏర్పాటు చేస్తున్నారు.  ఈ రోప్ వే రవాణా వ్యవస్థలో భాగంగా 150 ట్రాలీ కార్లను వినియోగించనున్నారు. ఇవి నేలకు 45 నుంచి 50 మీటర్ల ఎత్తులో బలమైన కేబుల్స్ ఆధారంగా ప్రయాణించనున్నాయి. ఒక్కో ట్రాలీ కార్ లో 10 మంది ప్రయాణికులు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. రోజుకు 16 గంటల పాటు సేవలు అందించేలా ఈ రోప్ వే వ్యవస్థకు రూపకల్పన చేస్తున్నారు. ఈ రోప్ వే వ్యవస్థ ఎప్పుడెప్పుడు అమరులోకి వస్తుందా అని కాశీ విశ్వనాథుని దర్శిస్తున్న  భక్తులు, యాత్రికులు ఎదురుచూస్తున్నారు

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos