ఇండిగో విమానాల రద్దుతో ఏర్పడిన సంక్షోభాన్ని ఇతర విమానయాన సంస్థలు అవకాశంగా మలుచుకున్నాయి. టికెట్ ధరలను భారీగా పెంచాయి. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. విమానయాన సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో, ఇండిగో సర్వీసులు రద్దయిన మార్గాల్లో టికెట్‌ ధరలను కేంద్రం క్రమబద్ధీకరించింది. కొత్తగా నిర్ణయించిన ఛార్జీలను తప్పనిసరిగా పాటించాలని అన్ని విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చేవరకు ఈ ఆదేశాలు పాటించాలని తెలిపింది.

ఇండిగో సర్వీసులు రద్దు కావడంతో ఇతర విమానయాన సంస్థలు టికెట్ ధరలను భారీగా పెంచేశాయి. సాధారణ ధరల కంటే ఏకంగా మూడు నుంచి పది రెట్లు అధికంగా టికెట్లు విక్రయిస్తున్నాయి. ప్రధాన నగరాల మధ్య ఒక్కరోజు ప్రయాణానికి సంబంధించిన టికెట్ ధరలు ఆకాశాన్ని తాకాయి. శుక్రవారం ఢిల్లీ - బెంగళూరు విమాన టికెట్ ధర రూ.1,02,000, చెన్నై - ఢిల్లీకి రూ. 90,000 లకు చేరింది. ఢిల్లీ – ముంబై టికెట్ ధర ఏకంగా రూ.54,222 పలికింది. ముంబై - శ్రీనగర్ మార్గంలో సాధారణంగా రూ.10 వేల లోపు ఉండే టికెట్ ధర, ఇప్పుడు రూ.62,000కు పెరిగింది.

కాగా ఇండిగోలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ గందరగోళంలో టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ కూడా చిక్కుకున్నారు. హైదరాబాద్ విమానాశ్రయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మొన్న బుధవారం ఉదయం 8:15 గంటలకు తాను హైదరాబాద్‌లోని ఇండిగో టెర్మినల్‌కు చేరుకున్నానని, కానీ అప్పటికే అన్ని విమానాలు ఆలస్యమయ్యాయని నరేశ్ తెలిపారు. మూసి ఉన్న బోర్డింగ్ గేట్ల వద్ద గందరగోళంలో ఉన్న ప్రయాణికుల వీడియోను ఆయన పోస్ట్ చేశారు. "విమాన ప్రయాణాల్లోని సరదా 90వ దశకంతోనే ముగిసిపోయింది. ఇప్పుడు గ్రౌండ్ సిబ్బందికి, ప్రయాణికులకు మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. అంతా గజిబిజిగా ఉంది" అని తన పోస్టులో పేర్కొన్నారు.

ప్రస్తుత విమాన ప్రయాణాల కన్నా 1990ల నాటి ప్రయాణాలే సురక్షితంగా, మెరుగ్గా ఉండేవని నరేశ్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, నటులకు ప్రైవసీ కూడా లేకుండా పోయిందని ఆయన వాపోయారు. "మాస్కులు, సన్‌గ్లాసెస్ పెట్టుకున్నా కూడా స్కానర్లు నటులను గుర్తించేస్తున్నాయి. టైమ్ మెషీన్ ఉంటే బాగుండును, 90ల నాటి రోజులకు వెళ్లిపోయేవాడిని" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos