దేశంలోని అతిపెద్ద బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగోకు కష్టాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా సిబ్బంది కొరత కారణంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వరుసగా మూడో రోజైన గురువారం కూడా దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో పెద్ద సంఖ్యలో విమానాలను రద్దు చేయడంతో వేలాది మంది ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో ఇండిగో కార్యకలాపాలు స్తంభించాయి. గురువారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరాల్సిన 30కి పైగా విమానాలు, హైదరాబాద్‌లో సుమారు 33 విమానాలు రద్దయ్యాయని, నేడు దేశవ్యాప్తంగా 170కి పైగా ఇండిగో విమానాలు రద్దయ్యే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. నిన్న కూడా నాలుగు ప్రధాన నగరాల్లో కలిపి దాదాపు 200 సర్వీసులను నిలిపివేశారని తెలుస్తోంది. 

ఈ క్రమంలో విమానాల రద్దుపై ఇండిగో స్పందించింది. తమ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగిందని అంగీకరిస్తూ, ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. ఊహించని కార్యాచరణ సవాళ్లు, సాంకేతిక లోపాలు, శీతాకాలం షెడ్యూల్ మార్పులు, సిబ్బంది రోస్టరింగ్‌కు సంబంధించిన కొత్త నిబంధనలు (FDTL) వంటి అనేక కారణాలు తమ కార్యకలాపాలపై ప్రభావం చూపాయని ఒక ప్రకటనలో తెలిపింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రాబోయే 48 గంటల పాటు షెడ్యూళ్లలో సర్దుబాట్లు చేస్తున్నామని, త్వరలోనే సేవలను సాధారణ స్థితికి తీసుకొస్తామని పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో, విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రంగంలోకి దిగింది. విమానాల రద్దుకు గల కారణాలపై పూర్తి నివేదిక సమర్పించాలని, ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించాలని ఇండిగోను ఆదేశించింది. ఈ అంశంపై చర్చించేందుకు ఇవాళ గురువారం సంస్థ అధికారులను సమావేశానికి పిలిచింది.

నవంబర్ నెలలో ఏకంగా 1,232 విమానాలను ఇండిగో రద్దు చేసినట్లు డీజీసీఏ తెలిపింది. వీటిలో 755 విమానాలు సిబ్బంది కొరత, ఎఫ్‌డీటీఎల్ నిబంధనల వల్లే రద్దయ్యాయని పేర్కొంది. దీనివల్ల అక్టోబర్‌లో 84.1 శాతంగా ఉన్న ఇండిగో ఆన్-టైమ్ పనితీరు (OTP) నవంబర్‌కు 67.7 శాతానికి పడిపోయింది. పైలట్లకు వారానికి 48 గంటల విశ్రాంతి, రాత్రిపూట ల్యాండింగ్‌లను రెండుకు పరిమితం చేయడం వంటి కొత్త FDTL నిబంధనలు నవంబర్ 1 నుంచి అమలులోకి రావడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos