పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆ సినిమాలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కూడా కైవసం చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా నిలిచాడు. దాంతో, బన్నీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఒక రోజులో తన దిన చర్య ఎలా ఉంటుంది?  షూటింగ్ ముందు ఏం చేస్తాడు? షాట్ కు ఎలా ప్రిపేర్ అవుతాడనే విషయాల సమాహారంతో ఇన్‌స్టాగ్రామ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన వీడియోను షేర్ చేశాడు. ఇలా ఇన్‌స్టాగ్రామ్ ఒక భారతీయ నటుడి వద్దకు ఒక రోజులో తను ఏం చేస్తాడనే విషయాలను వీడియో రూపంలో చూపించటం ఇదే మొదటిసారి. ఈ వీడియోలో బన్నీ నివాసం, రామోజీ ఫిల్మ్ సిటీలో 'పుష్ప 2' షూటింగ్ స్పాట్, తన అభిమానులతో బన్నీ ఎలా ఉంటాడనే విషయాలను చూపించింది. ప్రతిరోజు నిద్ర లేవగానే గార్డెన్ లోకి వచ్చి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ బ్లాక్ కాఫీ తాగడం, మధ్యాహ్నం ఒంటి గంట అవగానే తన పిల్లలతో వీడియో కాల్ చేసి మాట్లాడే విషయాలను చూపెట్టింది. ఇక సెట్స్‌ లో దర్శకుడు సుకుమార్ తో సినిమా గురించి చర్చించి, సెట్స్‌లో ఓ షాట్ ను చిత్రీకరించే విషయాన్ని కూడా వీడియోలో చూపించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ అభిమానుల కోసం ఇన్ స్టాగ్రామ్  మొదటిసారిగా హైదరాబాద్ వచ్చి, అల్లు అర్జున్ తో కలిసి వీడియో చెయ్యటం నిజంగానే ఒక సర్ ప్రైజ్. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయింది. బన్నీ అభిమానులకి అయితే పండగే పండగ. మొదటిసారి ఒక తెలుగు నటుడి కి ఇలా ఉత్తమ నటుడు అవార్డు రావటంతో అల్లు అర్జున్ చరిత్ర సృష్టించినట్లే. ఇప్పుడు ఈ వీడియోతో 'పుష్ప 2' ... ది రూల్ మీద కూడా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అభిమానులు ఎలా వుంటారు, వాళ్ళని అల్లు అర్జున్ ఎలా రిసీవ్ చేసుకుంటాడు, ఇవన్నీ ఇందులో ఇన్ స్టాలో చూపించారు. ఏదిఏమైనా ... ఇన్ స్టా ఇండియాకు అదీ మన హైదరాబాద్ కు రావడం... అల్లు అర్జున్ కు విస్తృతంగా కవరేజి ఇవ్వడం రియల్లీ గ్రేట్ కదా.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos