తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ పార్టీల మధ్య పొత్తుల సమీకరణలు కూడా ఒక కొలిక్కి వచ్చేలా పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ తో పొత్తు ఆశించిన కమ్యూనిస్టులు... అది జరగకపోయేసరికి... వారి చూపు కాంగ్రెస్ పై పడింది. కాంగ్రెస్ పార్టీ వారితో సీట్ షేరింగ్ కు సుముఖంగా ఉండటంతో... ఆ మూడు పార్టీల అధినేతల మధ్య త్వరలో చర్చలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో సీపీఐ నారాయణ భేటీ అయ్యారు. పొత్తులు, సీట్ల కేటాయింపుపై వీరు చర్చించినట్టు సమాచారం. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ... రాజకీయాల్లో అన్నీ అర్థరాత్రి సమయంలోనే జరుగుతాయని..ఇది కూడా అటువంటిదేనని చెప్పారు. కాంగ్రెస్‌‌తో చర్చలపై స్పందించిన ఆయన.. జాతీయస్థాయిలో ఇండియా కూటమిలో సీపీఐ భాగమైనందున రాష్ట్రంలో కూడా ఆ వైఖరిని తీసుకోవాలని అనుకుంటామని చెప్పారు. జాతీయస్థాయిలో వామపక్షాలు, కాంగ్రెస్‌ చేతులు కలిపినందున, ఇది రాష్ట్రస్థాయిలో కూడా ప్రతిబింబించాలని ... దాని గురించి ఇరు పార్టీలు సానుకూలంగా ఉన్నాయని... కార్యరూపం దాల్చాలని కోరుకుంటున్నానని నారాయణ పేర్కొన్నారు. కాగా... పొత్తులో భాగంగా మునుగోడు, హుస్నాబాద్‌, కొత్తగూడెం, బెల్లంపల్లి స్థానాలను సీపీఐ నేతలు కోరుతున్నట్లుగా తెలుస్తోంది.  ఒకటి, రెండు రోజుల్లో కమ్యూనిస్టు పార్టీల జాతీయ నేతలతో ... కాంగ్రెస్ అగ్రనేతలు చర్చలు జరపనున్నారు. ఇంకోవైపు సీపీఐ, సీపీఎం పార్టీలకు గెలవగలిగిన స్థానాల్లో చెరొక సీటు కేటాయించే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు సమాచారం. అయితే కమ్యూనిస్టులు చెరో మూడు సీట్లను కోరుతున్నట్లు తెలుస్తోంది. చివరకు చెరో రెండు సీట్లు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. చివరాఖరుకు ఏం జరుగుతుందో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos