రాజకీయంగా కాక పుట్టిస్తున్న తెలంగాణలో ఓటరు నాడి ఎలా ఉండబోతోంది... పోటీ ఎవరి మధ్య ఉండనుంది... ఫలితాలు ఏ విధంగా ఉండే అవకాశాలున్నాయనే అంశాలపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. హ్యాట్రిక్ విజయం మా  సొంతమని... వంద సీట్లు పక్కా అంటూ బీఆర్ఎస్ నేతలు గత కొన్నాళ్ళుగా గట్టిగానే జబ్బలు చరుస్తూ వచ్చారు. కానీ ఇపుడు అసలైన సమయం వచ్చేసింది. సాధారణంగా ఓటర్లు ఎన్నికల మీద పూర్తి సీరియస్ గా ఉండేది నోటిఫికేషన్ వెలువడిన తరువాతనే. అప్పుడే తన మనసులో మాటను చెబుతారు. ఎన్నికల కమిషన్ తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించడంతో ఇప్పుడు ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.

ఒపీనియన్ సర్వే ఫలితాలు సైతం వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు సర్వేల నివేదికలు... బీఆర్ఎస్ కి గెలుపు అంత ఈజీ కాదని తేల్చేస్తున్నాయి. ఇక ఎడ్జ్ ఏమైనా ఉందంటే అది కాంగ్రెస్ కే అని కూడా చెబుతున్నాయి. ఫేక్ సర్వేలు అని బీఆర్ఎస్ నేతలు హరీష్ లాంటి వారు కొట్టి పారేయవచ్చు కానీ కర్నాటకలో బీజేపీ అలాగే ఎకసెక్కమాడి ఇపుడు అపోజిషన్ లో కూర్చుంది. ఏబీపీ, సీ ఓటర్ సర్వే ప్రకారం చూస్తే బీఆర్ఎస్ అధికార పీఠం దక్కించుకోవాలంటే హోరాహోరీ పోరు తప్పదనే అంటున్నారు.

బీఆర్ఎస్ కంటే కూడా ఓట్లు, సీట్ల విషయంలో కాంగ్రెస్ ముందు ఉండడం ఈ సర్వే సారాంశం యొక్క విశేషం. బీఆర్ఎస్ కు 43 నుంచి 55 సీట్ల దాకా వచ్చే చాన్స్ ఉందని ... కాంగ్రెస్ కు 48 నుంచి 60 స్థానాల దాకా వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే చెబుతోంది. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్న బీజేపీ 5 నుంచి 11 సీట్లకు పరిమితమవుతుంది. ఇతరులు 5 నుంచి 11 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఏబీపీ-సీఓటర్ సర్వే అంచనా ప్రకారం కాంగ్రెస్ 39 శాతం ఓట్ల షేర్‌ రాబట్టనుంది. గత ఎన్నికల్లో 28.3 శాతం ఓట్ల షేర్ ఉన్న కాంగ్రెస్ అదనంగా మరో 10.5 శాతం ఓటింగ్ పెంచుకోనుంది. ఆ తర్వాత స్థానంలో బీఆర్ఎస్ 37 శాతం ఓటింగ్ షేర్ రాబట్టుకోనుంది. ఆ ప్రకారం గత ఎన్నికల్లో కంటే ఓటింగ్ శాతం 9.4 శాతం తగ్గనుంది. బీజేపీ సైతం 16 శాతం ఓట్ల షేర్ రాబట్టుకోనుంది. గత ఎన్నికల కంటే ఇది 9.3 శాతం అధికం. ఇతరుల ఓటింగ్ శాతం 7.4 వరకూ ఉంటుంది. గత ఎన్నికల్లో ఇది 17.8 శాతంగా ఉండగా, ఈసారి 10.4 శాతం ఓటింగ్ షేర్ తగ్గనుంది. ఏదిఏమైనా బీజేపీ అధికారం అన్న మాటను మరచిపోయేలా సర్వేలు చెబుతున్నాయి. మున్ముందు బీజేపీ ఎలా సర్దుకుంటుందో చూడాల్సి ఉంటుందని అంటున్నారు. ఇక బీయారెస్ హ్యాట్రిక్ విజయం సాధించడమనేది కేసీయార్ చాణక్యం మీదనే ఆధారపడి ఉందని విశ్లేషకులు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos