ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో... ఊరూపేరూ లేని వివిధ సర్వే సంస్థలు పుట్టుకొచ్చి ... వాటికి తోచిన అభిప్రాయాలు జనం మీద రుద్దుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలోని వైసీపీ సర్కారు కూడా ... తనకు అనుకూలంగా సర్వేలు చేయించుకుని నివేదికలు విడుదల చేయిస్తోంది. ఏపీలో ఇటీవల రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయిన క్రమంలో ఆ పార్టీ అధినేత సీఎం జగన్ గుండెల్లో భయం పట్టుకుంది. మరీ ముఖ్యంగా చంద్రబాబు అక్రమ అరెస్టుతో ప్రజల్లో సానుభూతి పెరుగుతోందని జడుసుకుని... వెంటనే అలర్ట్ అయి... అప్పటికప్పుడు ఒక ఫేక్ సర్వే చేయించి జనాలపైకి వదిలేశారు. ఇటీవల ‘టైమ్స్ నౌ’ జాతీయ ఛానల్ ... ఈటీజీ అనే సంస్థతో చేయించిన సర్వే కూడా అలాంటిదే.  అసలు ఎవ్వరికీ తెలియని రహస్యమేమిటంటే... ఈ సర్వేను ‘టైమ్స్ నౌ’ సంస్థకు చెందిన జర్నలిస్టులు, ఉద్యోగులు చేయలేదు. జగన్ తో డీల్ కుదుర్చుకున్న ఆ ఛానల్ ... ఈటీజీ అనే సంస్థ ద్వారా సర్వే చేయించి ... ఆ ఫేక్ సర్వేను ప్రజలపై రుద్దింది. ఎప్పటిలాగానే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 24 నుంచి 25 ఎంపీ సీట్లు వస్తాయని ఈ సర్వే వెల్లడించింది. అసలు ఈ సర్వేకు ఎంత విశ్వసనీయత ఉందన్నదన్నదే ప్రశ్నార్థకంగా నిలిచింది. ఈటీజీ రీసెర్చ్ సంస్థను యోగి స్ట్రాటజీస్ ఎల్‌ఎల్‌పీ, విదుర కన్సల్టింగ్ సంస్థలు నడుపుతున్నాయి. వీటికి యజమాని అవినాష్ ఇరగవరపు. ఆయన ఎవరో కాదు.. ఏపీ సీఎం జగన్‌కు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్. ఏపీ ప్రభుత్వం తరఫున ఏటా... రూ. 45 లక్షల జీతభత్యాలు తీసుకుంటున్న కాంట్రాక్ట్ ఉద్యోగి. జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే... ఆయనకు సీఎంఓలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అనే ఉద్యోగం క్రియేట్ చేసి అందులో కూర్చోబెట్టారు. ఆయన మార్గదర్శితో పాటు టీడీపీ మీద అక్రమకేసులు పెట్టి వాటిని మేనేజ్ చేయడంలో ఎగ్జిక్యూటివ్ గా వ్యవహరిస్తుంటారు. ఢిల్లీలో మార్గదర్శి వ్యవహారంలోనూ, చంద్రబాబు అక్రమకేసుల వ్యవహారంలో కూడా తలదూర్చి... సీఐడీ ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసేందుకు..  ఈ అవినాష్ ఇరగవరపు సంపూర్ణ సహకారం అందించారు కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం సర్వే సంస్థను ఏర్పాటు చేసి... ఈటీజీ సంస్థ పేరుతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ 25కి 25 ఎంపీ సీట్లు గెలుస్తుందని ఫేక్ సర్వేలను టైమ్స్ నౌ వాళ్లకు పంపి నెలకోసారి ప్రసారం చేయిస్తున్నారు. తద్వారా జగన్ కు ప్రజల్లో తిరుగులేదనే అభిప్రాయం కలుగజేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంస్థకు ఎలాంటి ట్రాక్ రికార్డు లేదు. అసలు ఉద్యోగులే లేరు. సర్వే చేసే సామర్థ్యం కూడా ఈ సంస్థకు లేదు. మరి ఈ సర్వేలు ఎలా చేస్తారనేదే అందరి మదిలో తలెత్తే ప్రశ్న. ఏంలేదు... తాడేపల్లె ప్యాలెస్ లో కూర్చొని... పేపర్ల మీద వాళ్లకు వాళ్లే రాసేసుకుని... ... టైమ్స్ నౌ దగ్గరకు వెళతారు. జగన్ తో ఆ సంస్థకు ఎలాగూ డీల్ ఉందికాబట్టి... దాన్ని సర్వేగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు.... జగన్ ప్రభుత్వం ఫేక్ సర్వేలు విడుదల చేసి ప్రజలను మెస్మరైజ్ చేస్తోందంటేనే... వైసీపీ సర్కారు పూర్తిగా డిఫెన్స్‌లో పడినట్లు అర్థమవుతోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజల నెత్తిన బోగస్ సర్వేలను బూచిగా చూపించి జగన్ అనుకూల మీడియా, వైసీపీ సోషల్ మీడియా ఊదరగొట్టేస్తున్నాయి. చంద్రబాబు జైలుకు వెళ్లారన్న సానుభూతి లేదని.. టీడీపీ అవినీతి చేసిందని ప్రజలు నమ్ముతున్నారని విషప్రచారం చేస్తున్నాయి. వాస్తవ పరిస్థితి మరోలా ఉండగా... వైసీపీ విడుదల చేయిస్తున్న ఫేక్ సర్వేలను చూసి ప్రజలందరూ ... ఇదేం విడ్డూరమోనంటూ ఆశ్చర్యచకితులవుతున్నారు. జాతీయ మీడియా పేరును అడ్డుగా పెట్టుకుని ఈటీజీ రీసెర్చ్ సర్వే సంస్థ ... వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఫలితాలను వెల్లడిస్తూ అటు జనరల్ పబ్లిక్ నే కాకుండా... మేధావులను, రాజకీయ పరిశీలకులను సైతం అయోమయానికి గురి చేస్తోంది. జగన్‌కు ఏపీ పొలిటికల్ సీన్ అర్థమై... ఓటమి భయం మరింత పెరిగింది కాబట్టే ఆయన ఫేక్ సర్వేలను నమ్ముకున్నారని.. ఈ సర్వేలపై చర్చ జరిగి ప్రజల సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos