ఇండియాపై పాకిస్థాన్ దేశానికి చెందిన ఉగ్ర సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ మరోసారి ఆత్మాహుతి దాడి చేసేందుకు సన్నాహాలు చేస్తోందని.. ఇందుకోసం నిధులను సేకరిస్తోందని నిఘా వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఈ సంస్థకు ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు పేలుడుతో సంబంధం ఉన్నట్లు దర్యాప్తు సంస్థ గుర్తించాయి. మరోసారి ఉగ్రదాడి చేసేందుకు సేకరిస్తున్న విరాళం దాదాపు 20 వేల పాకిస్తాన్ రూపాయలు కాగా.. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.6,400 ఉంటుంది. ఈ మొత్తాన్ని ఫీల్డ్‌లో ఉన్న ఉగ్రవాదికి అవసరమైన వస్తువులు అంటే బూట్లు, ఉన్ని సాక్సులు, ఒక పరుపు, ఒక టెంట్ వంటి వాటిని కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తారు. 'ముజాహిద్' (పోరాట యోధుడు) కోసం వింటర్ కిట్‌ను అందించేవారిని 'జిహాదీ'గా పరిగణిస్తామని జైష్ నాయకులు పిలుపునిచ్చారు. అలాగే 'జిహాదీ' చనిపోయిన తర్వాత అతనిని 'పట్టించుకునే' వారు కూడా 'జిహాదీ'గా పిలవబడతారు.

ఎర్రకోట పేలుడు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ఆధారాల ప్రకారం.. జైష్ నాయకులు డిజిటల్ మార్గాల ద్వారా ముఖ్యంగా పాకిస్థాన్ యాప్ అయిన సదాపే (SadaPay) ద్వారా నిధులు సేకరించాలని పిలుపునిచ్చారు. ఈసారి మహిళల నేతృత్వంలో దాడికి పాల్పడే అవకాశం ఉందని కూడా నిఘా వర్గాలు తెలిపాయి. జైష్‌-ఎ-మొహమ్మద్‌కు ఇప్పటికే 'మహిళా విభాగం' ఉంది. దీనిని 'జమాత్ ఉల్-ముమినత్' అని పిలుస్తారు. టెర్రర్ చీఫ్ మసూద్ అజార్ సోదరి సాదియా ఈ యూనిట్‌కు నాయకత్వం వహించే బాధ్యతను తీసుకున్నారు. ఎర్రకోట పేలుడుకు ఆర్థిక సహాయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక నిందితురాలు డాక్టర్ షాహీనా సయీద్ (కోడ్‌నేమ్ 'మేడమ్ సర్జన్') కూడా ఈ యూనిట్‌లో సభ్యురాలని నివేదికలు సూచిస్తున్నాయి. నవంబర్ 10న చారిత్రక ఎర్రకోట సమీపంలో అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ (ANFO), ఇతర పేలుడు పదార్థాలతో నిండిన హ్యుందాయ్ ఐ20 కారు పేలిన ఘటనలో దాదాపు 13 మంది మరణించారు. ఈ కారును డాక్టర్ ఉమర్ మహమ్మద్ నడిపాడు. అతను పేలుడులో మరణించాడు. ఆత్మాహుతి బాంబు దాడులను "తప్పుగా అర్థం చేసుకున్నారని" ఉమర్ మహమ్మద్ సెల్ఫీ వీడియో మంగళవారం నెట్టింట వైరల్ అయింది. ఎర్రకోట దాడిని నిర్వహించిన 10 మంది సభ్యుల 'టెర్రర్ డాక్టర్' బృందానికి త్వరితగతిన నిధులను బదిలీ చేయడమే ఈ డిజిటల్ ఫండింగ్ నెట్‌వర్క్ లక్ష్యమని తెలిసింది. ఈ నెల ప్రారంభంలో అందిన తాజా నిఘా సమాచారం ప్రకారం.. పాక్ మద్దతుగల ఉగ్రవాదం జమ్మూ కాశ్మీర్‌లో ప్రమాదకరంగా పెరుగుతోంది. జైష్, లష్కరే తోయిబా వంటి ప్రధాన సమూహాలు సమన్వయ దాడుల కొత్త వేవ్ కోసం సిద్ధమవుతున్నట్లు ఆ సమాచారం వెల్లడించింది. ఈ రెండు ఉగ్రవాద సంస్థలకు పాక్ సైన్యం, ఆ దేశ 'డీప్ స్టేట్' ఆర్థిక సహాయం అందిస్తున్నాయని తెలుస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos