ఎంతో కాలంగా చర్చల్లో నలుగుతున్న జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఇవాళ లోక్‌సభ ముందుకు తీసుకొచ్చింది. ఈ బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం దీనిపై హాట్ హాట్ గా చర్చ కొనసాగుతుండగా.. బిల్లు కోసం బీజేపీ, కాంగ్రెస్ సహా చాలా పార్టీలు విప్ జారీ చేయడం తెలిసిందే. ఈ బిల్లుకు ఎన్డీఏలోని పార్టీలన్నీ జై కొడుతున్నాయ్. ఎన్టీఏ కూటమిలోని ప్రధాన పక్షమైన బీజేపీతోపాటు టీడీపీ, జేడీయూ, షిండే-శివసేన, అజిత్‌పవార్- ఎన్సీపీ, జేడీఎస్, జనసేన, లోక్‌జన్‌శక్తి, రాష్ట్రీయ లోక్‌దళ్, సోనేలాల్ అప్నాదళ్, నేషనల్ పీపుల్స్ పార్టీ మద్దతు ఇస్తున్నాయి. కాంగ్రెస్, డీఎంకే, సమాజ్ వాది పార్టీ, ఆర్జేడీ, టీఎంసీ, బీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం.. జమిలికి నో చెబుతున్నాయి.
ఈ బిల్లు పాస్ కావడం కోసం మోదీ ప్రభుత్వం విపక్షాల మద్దతును కూడగట్టే ప్రయత్నంలో ఉంది. ఇందుకోసం JPCని ప్రకటించే అవకాశం ఉంది. జమిలి బిల్లును JPC పరిశీలించడానికి తొలుత 90 రోజుల సమయం ఇస్తారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి, కాలవ్యవధిని పొడిగించే అవకాశం ఉంది. జమిలి బిల్లును సభలో ప్రవేశపెట్టడం వరకు ఓకే.. కానీ, ఆమోదం పొందడం మాత్రం అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఎందుకంటే, జమిలి బిల్లు ఆమోదం పొందాలంటే.. రాజ్యాంగ సవరణలు తప్పనిసరి. అందుకు, పార్లమెంట్‌లో సాధారణ మెజారిటీ సరిపోదు. మూడింట రెండో వంతు ఎంపీల మద్దతు అవసరం. అంటే, పార్లమెంట్‌లో 67శాతం సపోర్ట్ కావాలి.. లోక్‌సభలో 362మంది ఎంపీలు, రాజ్యసభలో 164మంది సభ్యులు మద్దతు లభిస్తే బిల్లు గట్టెక్కుతుంది. ప్రస్తుతమున్న బలాబలాల ప్రకారం అధికారపక్షం ఎన్డీఏకి మూడింట రెండొంతుల బలం కనిపించడం లేదని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న లెక్కను బట్టి చూస్తే అటు లోక్ సభలోనూ, ఇటు రాజ్యసభలోనూ జమిలి బిల్లు ఆమోదం పొందడం కష్టమేనని వారు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos