జమిలి ఎన్నికల పై స్పష్టత వచ్చింది. ముహూర్తం దాదాపు ఫిక్స్ అయింది. నియోజకవర్గాల పెంపు పైనా ఢిల్లీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ సీట్లలో మహిళా రిజర్వేషన్ అమలుకు కేంద్రం సిద్దమైంది. జనగణన పూర్తవుతూనే బీజేపీ మార్క్ ప్లాన్ అమలు దిశగా కసరత్తు జరుగుతోంది. దీంతో, తెలంగాణలో 2028 చివర్లో జరగాల్సిన ఎన్నికల షెడ్యూల్ మారనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కేంద్రం తాజా లెక్కలతో కొత్త రాజకీయం తెర మీదకు రానుంది.

రెండో విడత బడ్జెట్ సమావేశాల్లోనే జమిలి బిల్లును ప్రవే పెట్టేందుకు కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్వి భజన ప్రక్రియ వచ్చే ఎన్నికల నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉంది. ఈ మేరకు కేంద్రం నుంచి సంకేతాలు అందుతున్నాయి. తాజాగా తెలంగాణ  సీఎం రేవంత్ సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. 2029లో జమిలి ఎన్నికలు జరగడం ఖాయమని.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సైతం అప్పుడే ఉంటాయని పేర్కొన్నారు. దీనివల్ల తాను ఐదున్నరేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని.. తనకు ఆరు నెలలు సీఎం పదవి బోనస్‌ అని చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో నియోజక వర్గాల పునర్‌వ్యవస్థీకరణ కచ్చితంగా జరుగుతుందని స్పష్టం చేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాల్సి ఉంది. దీని ద్వారా తెలంగాణలో 34, ఏపీలో 50 అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి.

జమిలి ఎన్నికలకు సాంకేతిక అడ్డంకులు లేకపోతే... 2029 లోనే జరిగేలా కేంద్రం ప్లాన్ చేస్తోంది. దీంతో, ఏపీలో ఎన్నికల షెడ్యూల్ లో ఎలాంటి మార్పు ఉండదు. అయితే.. లోక్ సభ నియోజక వర్గాలను సైతం పునర్విభజన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్ల మేరకు సీట్ల కేటాయింపు చేయాల్సి ఉంటుంది. 2029 ఎన్నికలు బీజేపీ నాయకత్వానికి జీవన్మరణ సమస్య కావటంతో.. పక్కా వ్యూహాత్మకంగా ఈ నిర్ణయాల అమలు ద్వారా ఎన్నికలకు వెళ్లేందుకు సిద్దం అవుతున్నట్లు సమాచారం. ఇక.. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రెండు రాష్ట్రాల్లోని ప్రతీ పార్లమెంట్ పరిధిలో రెండు అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. అదే విధంగా మహిళలకు లోక్ సభ సీట్లు ప్రత్యేకంగా రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. ఈ నెలలో ప్రారంభం కానున్న జనగణన పూర్తి అయిన తరువాత ఖరారు చేసే లెక్కల ఆధారంగా ఈ నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ.. కేంద్రం తాజా ప్రణాళికలు.. రాజకీయ లెక్కలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ఆసక్తిని పెంచుతున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos