లోక్ సభ, రాష్ర్టాల అసెంబ్లీలకు ఒకేసారి నిర్వహించేలా జమిలి ఎన్నికల కోసం తెచ్చిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కీలక ముందడుగు వేసింది. ఈ బిల్లు కాస్త ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి చేరింది. గత మంగళవారం లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు పెట్టగా ... ఈ బిల్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగించేలా ఉందని.. దీనిని జేపీసీకి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అలాంటిదేమీ లేదని అధికార ఎన్డీఏ స్పష్టం చేసినా.. చివరకు ప్రతి పక్షాల అభిప్రాయాన్ని గౌరవించి జేపీసీకి ఓకే చెప్పింది. అలా శుక్రవారం ఆ బిల్లు జేపీసీకి చేరింది.
అయితే ఇప్పుడు జిపిసి లోని సభ్యుల సంఖ్యను మార్చారు. తొలుత జేపీసీలో 31 మంది సభ్యులు ఉంటారని భావించారు. ఈ జేపీసీలో లోక్ సభ సభ్యులు 21, రాజ్యసభ సభ్యులు 10 మంది అని తొలుత ప్రకటించారు. కానీ, లోక్ సభ సభ్యుల సంఖ్యను 27కు, రాజ్య సభ సభ్యుల సంఖ్యను 12కి పెంచారు. అంటే మొత్తం 39 మందితో జేపీసీ ఉంటుందన్నమాట. ఇక జేపీసీలో ఐదుగురు తెలుగు ఎంపీలకు చోటు దక్కింది. వీరిలో వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి, బీజేపీ నుంచి సీఎం రమేశ్, కె.లక్ష్మణ్, జనసేన కు చెందిన వల్లభనేని బాలశౌరి, టీడీపీకి చెందిన హరీశ్ బాలయోగి ఉన్నారు. జమిలి బిల్లును జేపీసీకి పంపడంపై కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి మూజువాణి ఓటుతో ఆమోదం లభించింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos