దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ, ఎన్‌ఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత కల్పించేందుకు నిర్వహిస్తున్న జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ -2025 తొలి సెషన్ పరీక్షలు జనవరి 22 అంటే ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు ఈ నెల 30 వరకు జరగనున్న విషయం తెలిసిందే. పలు పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు ఉదయం ఏడు గంటలకే చేరుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని నగరాలతోపాటు పలు పట్టణాల్లోనూ పరీక్షా కేంద్రాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఏర్పాటు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రెండో విడత జేఈఈ మెయిన్ పరీక్షలు జరుగుతాయి. రెండు విడతల్లో వచ్చిన ఉత్తమ స్కోర్ ఆధారంగా తుది ర్యాంకులు కేటాయిస్తారు. జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించిన తొలి 2.50 లక్షల మందిని జేఈఈ ఆడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఉంటుంది. జేఈఈ మెయిన్ ర్యాంకులతో ఎన్‌ఐటీలు, అడ్వాన్స్‌డ్ ర్యాంకులతో ఐఐటీల్లో సీట్లు పొందొచ్చు.
కాగా దేశ వ్యాప్తంగా ఉన్న 31 ఎన్‌ఐటీల్లో గత ఏడాది సుమారు 24 వేలు సీట్లు, 23 ఐఐటీల్లో 17,600, ట్రిపుల్‌ఐటీల్లో దాదాపు 8500 సీట్లు, ఇతర విద్యాసంస్థల్లో 57 వేల సీట్ల వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ జేఈఈ మెయిన్ రాసిన ప్రతి వంద మందిలో నలుగురికి మాత్రమే సీట్లు దక్కుతాయి. ఇదిలా ఉండగా జేఈఈ మెయిన్ పరీక్షల నేపథ్యంలో హైదరాబాద్ లోని పలు పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ కాగా.. ఎల్‌బీనగర్‌లో ట్రాఫిక్‌కు కాసేపు అంతరాయం కలిగింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos