కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో పలు ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల కూటమిలో సమాజ్ వాది పార్టీ కూడా ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల పాట్నాలో జరిగిన విపక్షాల భేటీకి ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా హాజరయ్యారు. మరోవైపు విపక్షాల కూటమిలో ఉన్న కాంగ్రెస్‌తో సహా పలు పార్టీలు.. బీఆర్‌ఎస్‌ను బీజేపీ బీ టీమ్‌గా ఆరోపణలు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో... అఖిలేష్ యాదవ్ ... కేసీఆర్‌తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ... బీజేపీని గద్దె దింపాలంటే విపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని ... బీజేపీ వ్యతిరేకులను కలుపుకోవాల్సిన అవసరం ఉందని.. విపక్షాల పోరాటానికి మద్దతు కోరడానికే కేసీఆర్‌తో చర్చించేందుకు వచ్చానని అన్నారు. మరోవైపు... కాంగ్రెస్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి.
పాట్నా తర్వాత బెంగళూరులో జరగాల్సిన రెండో మీటింగ్ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఈ కూటమిలో ప్రస్తుతం బీఆర్ఎస్ లేదు. తాము బీజేపీ, కాంగ్రెస్ కి సమదూరంగా ఉన్నట్లు ఇప్పటికే బీఆర్ఎస్ స్పష్టం చేసింది. రెండు పార్టీలు దేశాన్ని అభివృద్ధిలో వెనక్కు నెట్టాయని, వాటికి ప్రత్యామ్నాయం రావాలనేది బీఆర్ఎస్ ఆశయం. ఈ దశలో సీఎం కేసీఆర్ తో అఖిలేష్ యాదవ్ భేటీ ఆసక్తికరంగా మారింది. ఇదిలావుండగా... వివిధ అంశాలపై చర్చల కోసం ప్రతిపక్షాల సమావేశాన్ని ఈ నెల 10 లేదా 12న సిమ్లాలో నిర్వహించనున్నట్లు తొలుత ప్రకటించారు. అయితే హిమాచల్ ప్రదేశ్‌లో నెలకొన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా.. ఆ సమావేశ వేదికను బెంగళూరుకు షిప్ట్ చేస్తున్నట్టుగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు. బెంగళూరులో జూలై 13, 14 తేదీల్లో విపక్షాల మీటింగ్ ఉంటుందని ఆయన చెప్పారు. అయితే బెంగళూరులో జరగాల్సిన ప్రతిపక్ష పార్టీల సమావేశం కూడా వాయిదా పడింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తర్వాత ఈ సమావేశాన్ని నిర్వహించాలని విపక్ష పార్టీలు భావిస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి. అదేవిధంగా... జులై నెలలో బీహార్, కర్ణాటక అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. బీహార్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జూలై 10-24 తేదీల మధ్య జరగనున్నాయి.
మరోవైపు కర్ణాటక అసెంబ్లీ వర్షకాల సమావేశాల నేపథ్యంలో.. రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకత్వం కూడా ప్రతిపక్షాల సమావేశాన్ని వాయిదా వేయాలని కోరినట్లుగా ప్రచారం సాగుతోంది. అదేవిధంగా... మహారాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలు కూడా విపక్షాల భేటీ వాయిదా పడటానికి కారణమనే ప్రచారం వినిపిస్తోంది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో విపక్షాల రెండో సమావేశం వాయిదా పడనున్నట్లు సమాచారం. తదుపరి షెడ్యూల్ ఎప్పడు ప్రకటిస్తారో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos