తెలంగాణ కమ్యూనిస్టు పార్టీల నేతలు ... బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పై గుర్రుగా ఉన్నారు. కేసీఆర్ మిత్రధర్మం మరిచి మోసం చేశారని ... మునుగోడులో బీజేపీని ఓడించేందుకే ... మేము బీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చినప్పుడు... ఇక భవిష్యత్తులో కూడా కలిసి ఉందామని కేసీఆర్ అప్పట్లో చెప్పారని ... కానీ ఆ తర్వాత ఇప్పుడు లెక్క ఎందుకు మారిందో ఆయనే చెప్పాలని లెఫ్ట్ నేతలు అంటున్నారు. మునుగోడులో మద్దతివ్వడం మా తప్పు కాదని... కేసీఆర్‌ను నమ్మడమే మా తప్పు అని.. ఆయన మమ్మల్ని అవసరానికి వాడుకున్నారని తెలంగాణ సీపీఐ ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తీవ్రంగా విమర్శించారు. రాజకీయాల్లో మోసం చేసేవారు, మోసపోయేవాళ్లు ఉంటారని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసి పని చేద్దామని కేసీఆర్ మాతో ... అప్పట్లో... రెండుమూడుసార్లు అన్నారని... కానీ సీట్ల ప్రకటన సమయంలో మాకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా మోసం చేశారని... బీఆర్ఎస్ తో పొత్తుల కోసం మేము ఎప్పుడూ వెంపర్లాడలేదని కమ్యూనిస్టు పార్టీల నేతలు అంటున్నారు. సీపీఎం, సీపీఐలు కలిసి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నాయని... మాతో ఎవరైనా కలిసి వస్తే ఉమ్మడిగా నడవడానికి సిద్ధమని... లేదంటే కమ్యూనిస్టు పార్టీలు కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వారు చెప్పారు. వామపక్షాలకు సగంపైగా సీట్లలో ప్రభావం చూపే ఓటు బ్యాంకు ఉందని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. కాగా... మునుగోడు నియోజకవర్గ పరిధిలో ఆ పార్టీకి ఆ నియోజకవర్గంలో సాలిడ్ ఓటు బ్యాంక్ ఉండటంతో ... అక్కడ ఉపఎన్నికల సమయంలో కేసీఆర్... కమ్యూనిస్టులతో పొత్తులు పెట్టుకునేందుకు... రాష్ట్ర, జాతీయ కమ్యూనిస్టు నేతల్ని ప్రగతిభవన్‌కు పిలిపించి మరీ ... కేసీఆర్ చర్చలు జరిపారు. జాతీయ రాజకీయాల్లోనూ కలిసి చేద్దామని అన్నారు. మునుగోడులో ఏర్పాటుచేసిన బహిరంగసభలో కూడా.. కమ్యూనిస్టులతో బంధం ఈ ఒక్క ఉపఎన్నికతో ఆగదని ... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేస్తామని ప్రకటించారని వారు గుర్తు చేస్తున్నారు. కమ్యూనిస్టుల మద్దతుతో మునుగోడు ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అయితే ఆ తర్వాత కమ్యూనిస్టులతో కేసీఆర్ కు క్రమంగా గ్యాప్ పెరుగుతూ వచ్చింది. మారిన రాజకీయ పరిస్థితుల్లో కమ్యూనిస్టులతో పొత్తు వద్దని కేసీఆర్ భావించినట్లుగా ... ఇటీవల ప్రకటించిన అభ్యర్థుల జాబితాను బట్టి అర్థమవుతోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపొందడం వెనుక సీపీఐ, సీపీఎం ఓట్లే కారణమన్న అభిప్రాయాన్ని అన్నిపార్టీల నేతలు చెబుతున్నారు. బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం తన ఓటమికి ప్రధాన కారణం కమ్యూనిస్టులే అని బహిరంగంగా ప్రకటించారు. ఆ తరువాత కేసీఆర్ ఆలోచనాధోరణిలో ఎందుకు మార్పు వచ్చిందో ఏమో కానీ... కమ్యూనిస్టులను దూరం పెడుతూ వస్తున్నారు. బహుశా... సాధారణ ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తులు పెట్టుకుంటే... చెరో రెండు, లేదా మూడు సీట్లు ఇవ్వాల్సి వస్తుందని.. ఆ సీట్లు త్యాగం చేయడం కష్టమని కేసీఆర్ భావించి ఉంటారేమోనని విశ్లేషకులు అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో మా వల్ల లబ్ధి పొందిన కేసీఆర్ ... ఇప్పుడు సాధారణ ఎన్నికలకు వచ్చేసరికి మమ్మల్ని పూర్తిగా విస్మరించడం దారుణమని... కేసీఆర్ చేతిలో మోసపోయామని కమ్యూనిస్టు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos