తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగిన తరువాత అన్నిపార్టీలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. నవంబర్ 30న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దూకుడు పెంచుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్... ఇక గేర్ మార్చబోతున్నారు. కేసీఆర్ ది ఇప్పటివరకు ఒక లెక్క ... ఇప్పటి నుంచి మరో లెక్క అనేవిధంగా ఉండబోతోందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఆయన ఈ నెల 15 నుంచి 41 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఈ నెల 15న మేనిఫెస్టో విడుదల అనంతరం కేసీఆర్ పర్యటనలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజు నుంచి నవంబర్ 9 వరకు బీఆర్ఎస్ అధినేత సభలకు షెడ్యూల్ ఖరారైంది. కేసీఆర్ రోజుకు రెండు లేదా మూడుసభల్లో పాల్గొనేలా బీఆర్ఎస్ నేతలు షెడ్యూల్ సిద్ధం చేశారు.
నామినేషన్లు ప్రారంభమయ్యే నవంబర్ 3వ తేదీ లోపలే కేసీఆర్ 26 బహిరంగసభల్లో పాల్గొనననున్నారు. ఈ నెల 15న అభ్యర్థులకు కేసీఆర్ బీఫారాలను అందజేయనున్నారు. మరోవైపు ... సెంటిమెంట్ ప్రకారం ఈసారి కూడా ముందుగా హుస్నాబాద్ నుంచే 15న కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. 2014, 2018 ఎన్నికల్లో కూడా ఆయన హుస్నాబాద్ నుంచే ప్రచారాన్ని ప్రారంభించారు. ఇప్పుడు కూడా అదే ఆనవాయతీని కొనసాగిస్తూ తొలి సభకు అక్కడే నిర్వహించనున్నారు. సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి హరీశ్ రావు ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. కేసీఆర్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఈ విధంగా ఉండబోతోంది.
• అక్టోబర్ 15: హుస్నాబాద్
• అక్టోబర్ 16: జనగాం, భువనగిరి
• అక్టోబర్ 17: సిద్దిపేట, సిరిసిల్ల
• అక్టోబర్ 18: జడ్చర్ల, మేడ్చల్
• అక్టోబర్ 26: అచ్చంపేట్, నాగర్ కర్నూల్, మునుగోడు
• అక్టోబర్ 27: పాలేరు, స్టేషన్ ఘన్ పూర్
• అక్టోబర్ 29: కోదాడ, తుంగతుర్తి, ఆలేరు
• అక్టోబర్ 30: జుక్కల్, బాన్సువాడ, నారాయణఖేడ్
• అక్టోబర్ 31: హుజూర్ నగర్, మిర్యాలగూడ, దేవరకొండ
• నవంబర్ 1: సత్తుపల్లి ఇల్లెందు
• నవంబర్ 2: నిర్మల్, బాల్కొండ, ధర్మపురి
• నవంబర్ 3: భైంసా (ముధోల్), ఆర్మూర్ , కోరుట్ల
• నవంబర్ 5: కొత్తగూడెం, ఖమ్మం
• నవంబర్ 6: గద్వాల్, మక్తల్, నారాయణపేట
• నవంబర్ 7: చెన్నూరు, మంథని, పెద్దపల్లి
• నవంబర్ 8: సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి
• నవంబర్ 9: గజ్వేల్, కామారెడ్డి
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos