సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అన్ని ప్రధాన పార్టీలలో   రాజకీయ మంటలు చెలరేగుతున్నాయి.  మార్చి 9 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ క్రమంలో బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో ఢిల్లీకి రాజకీయ పర్యటన చేయనున్నారని తెలుస్తోంది. ఈ వారంలోనే ఆయన ఢిల్లీ టూర్ ఉంటుందని విశ్వసనీయంగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత కేసీఆర్ ఢిల్లీకి వెళ్తుండటం ఇదే తొలిసారి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ప్రమాదవశాత్తు కింద పడగా తుంటి ఎముక విరిగిన సంగతి తెలిసిందే. తర్వాత కేసీఆర్ కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నారు ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారు. నల్గొండ బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొన్నారు. మరోవైపు, రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకోబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. రాజకీయ విశ్లేషకులు సైతం దీనిపై పలు రకాలుగా విశ్లేషణలు చేస్తున్నారు. ఈ సమయంలో కేసీఆర్ ఢిల్లీకి వెళ్తుండటంపై ఆసక్తి నెలకొంది. అయితే, ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ ఎవరిని కలవబోతున్నారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. పర్యటనకు సంబంధించిన అజెండాపై కూడా వివరాలు వెల్లడి కాలేదు. రెండు, మూడు రోజుల్లో కేసీఆర్ పర్యటనపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవచ్చనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. ఇంకోవైపు, బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ ఆధిపత్యానికి చెక్ పెట్టొచ్చని ఢిల్లీ బీజేపీపెద్దలు భావిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ తో పొత్తు పై రాష్ట్ర బిజెపి నాయకుల్లో మరో అభిప్రాయం ఉంది. రాష్ట్ర బిజెపి పెద్దలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇప్పటికే ఈ మేరకు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos