కాంగ్రెస్ లో లోక్ సభ సీట్ల పంచాయితీ కొనసాగుతూనే ఉంది. 17 స్థానాలకు గాను ఇప్పటికే 14 నియోజవర్గాల్లో పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన స్థానాలపై చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కరీంనగర్, ఖమ్మం సీట్లపై ఉత్కంఠ నెలకొంది. ఖమ్మం టికెట్ తన భార్యకు కేటాయించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడి కోసు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇక్కడ ఈ ఇద్దరికి కాకుండా రామసహాయం రఘరాంరెడ్డికి టికెట్ ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రఘురామ రెడ్డి పొంగులేటికి వియ్యంకుడు అవుతారు. పొంగులేటి కుమార్తెను రఘురాంరెడ్డి చిన్న కుమారుడికి ఇచ్చారు. రఘురాంరెడ్డి పెద్ద కుమారుడు హీరో వెంకటేశ్ కుమార్తెను పెళ్లి చేసుకున్నారు. దీంతో కమ్మ సామాజిక వర్గం కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు. భట్టి మాత్రం తన భార్యకే టికెట్ కేటాయించాలని పట్టుబడుతున్నారు.మరోవైపు ఇటు కరీంనగర్ స్థానంపై కూడా ఉత్కంఠ నెలకొంది. కరీంనగర్ రేసులో అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు, తీన్మార్ మల్లన్న ఉన్నారు. ప్రవీణ్ రెడ్డి హుస్నావాద్ అసెంబ్లీ స్థానాన్ని వదులుకున్నందన.. ఆయనకే టికెట్ ఇవ్వాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం ఖమ్మంలో ఓసీకి టికెట్ కేటాయిస్తే కరీంనగర్ లో బీసీకి ఇవ్వాలని భావిస్తునట్లు తెలుస్తోంది. కరీంనగర్ లో బీజేపీ నుంచి బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ పోటీ చేస్తున్నారు. అయితే బండి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో కాస్త సెంటిమెంట్ కలిసి వస్తుందని... అతన్ని తట్టుకుని గెలిచే అభ్యర్థినిఎంపిక చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ క్రమంలో దాదాపుగా ప్రవీణ్ రెడ్డికే టికెట్ కాన్ఫమ్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos