తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే రాజకీయాలు వాడివేడిగా మారుతున్నాయి. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరుద్యోగులను దగా చేసిన కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు కురిపిస్తూ బీజేపీ 24 గంటల నిరాహార దీక్షకు దిగింది. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ చేపట్టిన 24 గంటల ఉపవాస దీక్షకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఉపక్రమించారు. ఉద్యోగాలను భర్తీ చేసే విషయంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందంటూ ఆయన ఈ దీక్షను చేపట్టారు.
24 గంటల పాటు దీక్షను కొనసాగించడానికి హైదరాబాద్ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. సాయంత్రం 6 గంటల వరకే పర్మిషన్ ఇచ్చారు. అయినప్పటికీ- కిషన్ రెడ్డి దీక్షను కొనసాగిస్తోండటంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి... నిరాహార దీక్షను భగ్నం చేశారు. 24 గంటల ఉపవాస దీక్షను విరమించిన అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో ఏ ఒక్క వర్గానికి నిరసన తెలియజేసే పరిస్థితి లేదన్నారు. ముఖ్యమంత్రి రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. బయట ఉద్యమాలు చేయవద్దు, అసెంబ్లీలో మాట్లాడవద్దు అన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని అన్నారు. శాంతియుతంగా నిరసన చేస్తుంటే బీజేపీ కార్యకర్తలపై విపరీతంగా దాడులు చేశారని.. ఈ దాడులలో అనేక మంది కార్యకర్తలకు గాయాలయ్యాయన్నారు. తెలంగాణ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరామని... తెలంగాణ వస్తే నా తమ్ముళ్లకు, అన్నలకు, అక్కలకు, చెల్లెళ్లకు ఉద్యోగాలు వస్తాయని చెప్పిన కేసీఆర్ ఆ హామీ లను నెరవేర్చలేదని కిషన్ రెడ్డి విమర్శించారు.
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై కిషన్‌రెడ్డి స్పందించారు. చంద్రబాబుకు నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం అన్యాయమన్నారు. మాజీ ముఖ్యమంత్రిని దర్యాప్తు చేసే ముందు ప్రశ్నించకుండా అరెస్టు చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. గతంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అరెస్టు చేసే సమయంలో నోటీసులు ఇచ్చారని గుర్తుచేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos