మహాకుంభమేళా కొత్త రికార్డులను నెలకొల్పుతోంది. అంచనాలకు మించి భక్త జనం కుంభమేళాకు తరలి వస్తోంది. 40 కోట్ల మంది భక్తులు వస్తారని నిర్వాహకులు అంచనా వేసారు. కానీ ఇప్పటికే 53 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లుగా యూపీ ప్రభుత్వం వెల్లడించింది. కుంభమేళాలో పుణ్య స్నానాలకు ఇక ఒక ముహూర్తమే మిగిలి ఉంది. దీంతో, తెలుగు రాష్ట్రాల నుంచి ప్రయాగ్ రాజ్ కు భక్తుల తాకిడి పెరిగింది. జనవరి 13వ తేదీన ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26 శివరాత్రి వరకూ కొనసాగనుంది. దా దాపు 45 రోజులపాటు జరుగుతున్న ఈ కుంభమేళా ప్రపంచంలోనే అతి పెద్ద సంగమంగా నిలిచింది.

ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ మేళా ఈ నెల 26తో ముగియాల్సి ఉండగా.. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మరో రెండు రోజులు పొడిగించే అవకాశం ఉందంటూ ప్రచారం మొదలైంది. అయితే, ప్రభుత్వం మాత్రం పొడిగింపు ఆలోచన లేదని తేల్చి చెబుతోంది. ముందుగా నిర్ణయించిన ప్రకారమే ఈ నెల 26వ తేదీన మహాశివరాత్రి రోజునే కుంభమేళా ముగుస్తుందని అధికారులు స్పష్టం చేసారు.

ఇక.. ఈ రోజు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు ప్రయాగ్ రాజ్ చేరుకుని... పుణ్యస్నానాలు ఆచరించారు. ఏపీ మంత్రి నారా లోకేశ్...   ఈ రోజు మ‌హాకుంభ‌మేళాకు బ‌య‌లుదేరి వెళ్లారు. ఉద‌యం 10.10 నుంచి మ‌ధ్యాహ్నం 12.10 గంట‌ల మ‌ధ్య షాహి స్నాన‌ఘట్టంలో ప‌విత్ర స్నానం ఆచరించారు. ఆ త‌ర్వాత మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు ప్ర‌యాగ్‌రాజ్ నుంచి వార‌ణాసికి ప‌య‌నమై... మ‌ధ్యాహ్నం 2.45 గంట‌లకు వార‌ణాసి కాల‌భైర‌వ ఆల‌యాన్ని సందర్శించారు. ఇక వార‌ణాసిలో బయలుదేరి ఇవాళ రాత్రి సమయానికి  విజ‌య‌వాడ‌కు చేరుకుంటారని సమాచారం. కాగా కుంభమేళా ముగింపు సమయం సమీపిస్తుండటంతో భక్తుల రద్దీకి అనుగుణంగా తెలుగు రాష్ట్రాల నుంచి రైల్వే, ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos