గుజరాత్ లోని అహ్మదాబాద్  లో  గత నెలలో ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ తీసుకున్న ఐదు నిమిషాల్లోనే కుప్పకూలిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానంపై ఇవాళ పార్లమెంట్ లో విపక్షాలు కేంద్రాన్ని ప్రశ్నించాయి. ఈ ఘటనపై భారత విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) ఇచ్చిన నివేదికకూ, మీడియా కథనాలకూ మధ్య గ్యాప్ ఉండటం, కేంద్రం తీసుకున్న చర్యలపై విపక్షాలు అడిగిన ప్రశ్నలకు పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానం ఇచ్చారు.

ఇవాళ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగానే ఉభయసభల్లోనూ విపక్షాలు నిరసనలకు దిగాయి. ఆపరేషన్ సింధూర్ తో పాటు పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఈ నిరనసల మధ్యే రాజ్యసభలో కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు ఎయిర్ ఇండియా ప్రమాదంపై కీలక ప్రకటన చేశారు. ఈ ప్రమాదం తర్వాత విమానం బ్లాక్ బాక్స్ ను డీకోడ్ చేయడంలో విమాన ప్రమాదాల బ్యూరో సక్సెస్ అయిందని రామ్మోహన్ తెలిపారు. అలాగే ఈ దర్యాప్తులో పూర్తిగా నిష్పాక్షికంగా, ఖచ్చితమైన, నియమాలను అనుసరిస్తున్నట్లు వెల్లడించారు. తాము కేవలం సత్యానికి అండగా నిలవాలనుకుంటున్నట్లు తెలిపారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కచ్చితంగా ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకుంటున్నామన్నారు. అది ఏఏఐబీ తుది దర్యాప్తు నివేదిక తర్వాత మాత్రమే బయటకు వస్తుందన్నారు. అంతర్జాతీయ ప్రొటోకాల్స్ ప్రకారం దర్యాప్తు జరుగుతోందన్నారు.

ప్రాథమిక నివేదికను పరిశీలిస్తే గతంలో బ్లాక్ బాక్స్ కొద్దిగా దెబ్బతిన్నప్పుడల్లా దానిని విదేశాలకు పంపేవారని, అయితే తొలిసారి మన దేశంలోనే దీని అధ్యయనం చేస్తున్నట్లు రామ్మోహన్ తెలిపారు. అయితే ఓ కచ్చితమైన ముగింపునకు రావడానికి తుది నివేదిక కోసం ఎదురుచూడాల్సిందేనన్నారు. ఏఏఐబీ క్షుణ్ణంగా, నిబంధనల ఆధారంగా పూర్తిగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తుందన్నారు. ఇందులో అనేక ప్రశ్నలు తలెత్తవచ్చని, పాశ్చాత్య మీడియా వారి స్వంత కథనాలను ముందుకు తెచ్చినప్పటికీ తమ విధానం వాస్తవాలపై ఆధారపడి ఉంటుందన్నారు.

270 మంది మరణాలకు కారణమైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై భారత విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో చేస్తున్న దర్యాప్తులో ప్రాథమిక నివేదిక ఇప్పటికే వెల్లడైంది. ఇందులో కాక్ పిట్ లో ఓ పైలట్ మరో పైలట్ తో ఫ్యూయల్ స్విచ్ ఎందుకు ఆపావని అడిగితే మరో పైలట్ తాను ఆపలేదని చెప్పినట్లు, తిరిగి స్విచ్ ఆన్ చేసే లోపే విమానం కుప్పకూలినట్లు తెలిపారు. దీనిపై తీవ్ర కలకలం రేగింది. పైలట్లదే తప్పు అన్నట్లుగా ఈ రిపోర్టు ఉందని పైలట్ల సంఘం మండిపడింది. ఆ తర్వాత విదేశీ మీడియాలోనూ కెప్టెనే ఈ స్విచ్ ఆఫ్ చేసినట్లు పరోక్షంగా తేలిందని కథనాలు వచ్చాయి. దీనిపై పైలట్ల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తూ లీగల్ నోటీసులు కూడా పంపింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos